Whatsapp Voice Message Preview Feature: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఏ విధమైన ఆర్భాటం లేకుండానే అద్భుతమైన ఫీచర్ ప్రవేశపెట్టింది. వాట్సప్ రోల్ అవుట్ చేసిన ఆ ప్రత్యేక ఫీచర్ ఏంటి..ప్రయోజనాలేంటనేది తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిత్య జీవితంలో ఓ భాగంగా మారిన వాట్సప్ కొత్త ఫీచర్(Whatapp New Feature) ప్రవేశపెట్టింది. వాయిస్ మెస్సేజ్ ప్రివ్యూ ఫీచర్ ఇది. మీ కాంటాక్ట్స్‌కు వాయిస్ మెస్సేజ్ పంపే ముందు ఒకసారి ప్రివ్యూ చూసుకునే వెసులుబాటు కల్పించింది. మీరు పంపించే వాయిస్ మెస్సేజ్ సరిగ్గా ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు వీలవుతుంది. ఒకవేళ బాగా లేదనిపిస్తే వెంటనే మీరు దాన్ని డిస్కార్డ్ చేయవచ్చు. మళ్లీ రికార్డు చేసి పంపించవచ్చు. వ్యక్తిగతంగా లేదా గ్రూప్ చాట్ రెండింటిలోనూ వాయిస్ మెస్సేజ్ ప్రివ్యూ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లకు వర్తిస్తుంది. అంతేకాదు..వెబ్ , డెస్క్‌టాప్ వెర్షన్స్ కూడా అందుబాటులో ఉండనుంది.


ఎలా పని చేస్తుంది ఈ కొత్త ఫీచర్


మీ మొబైల్‌లో వాయిస్ మెస్సేజ్ ప్రివ్యూ ఫీచర్(Whatsapp Voice Message Preview Feature) ఉపయోగించాలంటే వాట్సప్ చాట్‌లోని మైక్రోఫోన్ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. హ్యాండ్స్ ఫ్రీ రికార్డింగ్ లాక్ చేయడానికి పైకి స్లైడ్ చేయాలి. అక్కడ మీకొక ఇంటర్‌ఫేస్ కన్పిస్తుంది. అందులో స్టాప్ బటన్, ట్రాష్ కన్పిస్తాయి. స్టాప్ బటన్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎవరికి పంపించాలనుకుంటారో..అంతకంటే ముందు వాయిస్ మెస్సేజ్ వినేందుకు ప్లే బటన్ ప్రెస్ చేయాలి. ఆ తరువాత సీక్ బార్ ట్యాప్ చేయడం ద్వారా ఆడియోలోని ఏదో  ఒక భాగానికి వెళ్లే సౌలభ్యం కలుగుతుంది. 


ఎలా డిలీట్ చేయాలి


ఒకవేళ మీకు పంపించాల్సిన మెస్సేజ్ నచ్చకపోతే ట్రాష్ కోన్‌పై ట్యాప్ చేసి తొలగించవచ్చు. లేదా సెండ్ బటన్ ప్రెస్ చేసి పంపించవచ్చు. ఒకవేళ మీకు టెక్స్ట్ వెర్షన్‌లో వాయిస్ మెస్సేజ్ పంపించాలనుకుంటే..ప్రివ్యూ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. మీరు మీ కాంటాక్ట్స్‌కు పంపించే ముందు వాయిస్ మెస్సేజ్‌ను డ్రాఫ్ట్ చేసేందుకు అనుమతి అడుగుతుంది. 


Also read: Google Warning: మీ స్మార్ట్‌ఫోన్లలో ఆ 8 యాప్‌లు ఉన్నాయా...వెంటనే తొలగించండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook