Google Warning: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు గూగుల్ హెచ్చరించింది. మీ ఫోన్స్‌లో ఆ యాప్‌లు ఉంటే వెంటనే డిలీట్ చేయాలని కోరుతోంది. ఆ యాప్స్ ఏంటి..కారణమేంటనేది తెలుసుకుందాం.
క్రిప్టోకరెన్సీకు సంబంధించిన 8 యాప్‌లను గూగుల్ తన ప్లేస్టోర్ (Google playstore)నుంచి తొలగించింది. అంతేకాకుండా మీ స్మార్ట్‌ఫోన్లలో ఆ యాప్‌లు ఉంటే వెంటనే తొలగించాల్సిందిగా యూజర్లను హెచ్చరించింది. వెంటనే తొలగించకపోతే భారీగా డబ్బులు కోల్పోవల్సి వస్తుంది. గూగుల్ తొలగించిన యాప్‌లు ఇవే..
1. బిట్ ఫండ్స్.. క్రిప్టో క్లౌడ్ మైనింగ్
2. వికీపీడియా మినెర్..క్లౌడ్ మైనింగ్
3. వికీపీడియా..పూల్ మైనింగ్ క్లౌడ్ వాలెట్
4. క్రిప్టో హోలిక్..వికీపీడియా క్లౌడ్ మైనింగ్
5. డైలీ వికీపీడియా రివార్డ్స్..క్లౌడ్ బేస్డ్ మైనింగ్
6. వికీపీడియా 2021
7. మైన్‌బిట్ ప్రో..క్రిప్టో క్లౌడ్ మైనింగ్ & బీటీసీ మైనర్
8. ఎథెరియం..పూల్ మైనింగ్ క్లౌడ్
ఎందుకంటే గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో లేని యాప్‌లను ఏపీకే ఫైల్(APK File) ద్వారా ఇన్‌స్టాల్ చేసుకునే సౌలభ్యముంది. అయితే గూగుల్ హెచ్చరిక ప్రకారం ఈ యాప్స్‌ను ఉంచకూడదు. ఈ యాప్‌లు మీ ఫోన్‌కు గానీ, ఫోన్‌లో వివరాలకు గానీ హాని కల్గించే అవకాశముందనేది గూగుల్ హెచ్చరిక. ఇవి మీ డేటాను తస్కరించేందుకు దారి తీస్తుందని గూగుల్ హెచ్చరిస్తోంది. సెక్యూరిటీ రీసెర్చ్ ట్రెండ్ మైక్రో, గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్న యాప్‌లు వినియోగదారుల్ని మోసం చేసేందుకు పనిచేస్తున్నాయని తేలింది. ఈ యాప్‌లు అడ్వర్టైజింగ్, సబ్‌స్క్పిప్షన్ సేవల ద్వారా ప్రతినెలా వినియోగదారుడి నుంచి 11 వందల రూపాయల వరకూ దోచుకుంటున్నాయని గూగుల్ తెలిపింది. ప్రజలు పెట్టే పెట్టుబడిని ఈ యాప్‌లు తప్పుడు మార్గంలో ఉపయోగిస్తున్నాయనేది గూగుల్ హెచ్చరిక(Google) సారాంశం. అందుకే తక్షణం మీ ఫోన్లలో ఈ యాప్‌లు ఉంటే వెంటనే తొలగించండి. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందట.
Also read: Viral video: ఎదురుగా దూసుకొస్తున్న రైలు-ట్రాక్‌పై ఏనుగు-చివరకు ఏం జరిగిందో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook