Google Assistant for whatsApp: వాట్సాప్ వాడే వారికి ఈ కొత్త కాలింగ్  ఫీచర్ చాలా ఉపయోగపడనుంది. వాట్సాప్ కాల్ ( Whatsapp Video Or WhatsApp Voice Call ) చేయాలి అనుకుంటే ముందు యాప్ ఓపెన్ చేసి అందులో కాలింగ్ అప్షన్ ఎంచుకోవాలి. గూగుల్ తాజా ప్రకటన ప్రకారం ఇకపై గూగుల్ అసిస్టెంట్ సహాయంతో కూడా వాట్సాప్ ఆడియో లేదా వీడియో కాల్స్ చేయవచ్చు. మీ హోమ్ స్క్రీన్‌లో సింపుల్‌గా గూగుల్ అసిస్టెంట్‌ను క్లిక్ చేసి వాట్సాప్ కాల్ ఫీచర్‌ను వినియోగించవచ్చు. అంతకు ముందు గూగుల్ వినియోగదారులు ( Google Users ) వీడియో కాల్స్ చేయడానికి హ్యాంగౌట్స్ ( Hangouts ) లేదా గూగుల్ డ్యుయోలను ( Google Duo ) వినియోగించేవారు. ( Also Read : ఐశ్వర్యరాయ్‌కి కరోనా పాజిటివ్, జయా బచ్చన్‌కు నెగటివ్ )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇకపై వారు వాట్సాప్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. దీని కోసం గూగుల్ అసిస్టెంట్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం మీ స్మార్ట్‌ఫోన్లో ఉన్న గూగుల్ అసిస్టెంట్ ఐకాన్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే గూగుల్ ( Ok Google ) లేదా హే గూగుల్ ( Hey Google ) అని అనాల్సి ఉంటుంది. 


గూగుల్ అసిస్టెంట్ స్పందించిన తరువాత మేక్ ఆ వాట్సాప్ కాల్- Make A WhatsApp Call To ( Contact Name ) అని ఎవరికి కాల్ చేయాలి అనుకుంటున్నామో వారి పేరు చెప్పాల్సి ఉంటుంది. అయితే మరింత వేగంగా కాల్స్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఆ కాంటాక్ట్ పేరును షార్ట్ కట్‌లో పెట్టాల్సి ఉంటుంది. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..