WhatsApp: త్వరలో వాట్సాప్ వెబ్ వీడియో, ఆడియో కాల్స్
New Feature in WhatsApp | ఎవరైనా కాల్ చేస్తున్నప్పుడు వారి ఫొటో కూడా మీకు కనిపిస్తుంది. ఒక ఔట్ గోయింగ్ కాల్స్ విండో కాస్త చిన్నగా ఉంటుంది.
WhatsApp Voice and Video Calls | వాట్సాప్ వినియోగదారులు నిత్యం కొత్త కొత్త ఫీచర్ల కోసం వెతుకుతూ ఉంటారు. వారికి తగిన విధంగా నూతన ఫీచర్లను వాట్సాప్ ( WhatsApp ) తీసుకొస్తూ ఉంటుంది. అందులో భాగంగా వాట్సాప్ వెబ్ వినియోగించే వారికోసం సరికొత్త ఫీచర్ తీసుకురానుంది అని సమాచారం. తాజా వర్షన్ 2.2043.7లో వాట్సాప్ ఈ ఫీచర్ ను పరీక్షించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ ఫీచర్ పూర్తిగా సిద్ధం కాలేదు అని..త్వరలో దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాని సమాచారం.
వాట్సాప్ వెబ్ ( WhatsApp Web ) వినియోగదారుల కోసం కాలింగ్ ఫీచర్ ( Feature ) మరో రెండు వారాల్లో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ప్రస్తుతం బీటా వర్షన్ పై ప్రయోగాలు జరుగుతున్నాయని వాట్సాప్ తాజా అప్డేట్స్ పై నివేదికలు అందించే WABetaInfo తెలిపింది. ఈ రిపోర్టులో కొత్త ఫీచర్ తాలుకూ స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసింది. కాల్స్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఒక విండో తెరుచుకుంటుంది. చిన్నపాటి ఈ విండోలో ఇంకమింగ్ కాల్ గురించి సమాచారం తెలుస్తుంది. దీన్ని మీరు యాక్సెప్ట్, డిక్లెయిన్ లేదా ఇగ్నోర్ చేయవచ్చు.
ALSO READ | Sanjay Dutt: కేన్సర్ నుంచి కోలుకున్న సంజయ్ దత్
ఎవరైనా కాల్ చేస్తున్నప్పుడు వారి ఫొటో కూడా మీకు కనిపిస్తుంది. ఒక ఔట్ గోయింగ్ కాల్స్ విండో కాస్త చిన్నగా ఉంటుంది. ఇందులో కాలింగ్ అనే అప్షన్ మాత్రమే కనిపిస్తుంది. ఇందులో రింగింగ్ ,కాలింగ్, ఇన్ కాల్ టైమర్ ఆప్షన్లు మాత్రమే కనిపిస్తాయి. ఈ కొత్త ఫీచర్లతో పాటు గ్రూప్ కాలింగ్ ఫీచర్ కూడా అందుబాటులోకి తీసుకురానుందట వాట్సాప్.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR