Social Media: కరోనాపై అసత్య ప్రచారంలో ఏయే దేశాలు ముందున్నాయో తెలుసా
Social Media: సోషల్ మీడియా ప్రచారం పెద్ద సమస్యగా మారింది. కారణం సోషల్ మీడియా ద్వారా సగం అసత్య ప్రచారమే జరగడం. కరోనా సంక్రమణ సమయంలో అసత్య ప్రచారంలో ఏయే దేశాలు ముందున్నాయనే విషయంలో ఆసక్తికరమైన అధ్యయనం కూడా జరిగింది.
Social Media: సోషల్ మీడియా ప్రచారం పెద్ద సమస్యగా మారింది. కారణం సోషల్ మీడియా ద్వారా సగం అసత్య ప్రచారమే జరగడం. కరోనా సంక్రమణ సమయంలో అసత్య ప్రచారంలో ఏయే దేశాలు ముందున్నాయనే విషయంలో ఆసక్తికరమైన అధ్యయనం కూడా జరిగింది.
కరోనా వైరస్(Corona Virus)మనిషిని ఎంతగా భయపెట్టిందో లేదో తెలియదు గానీ..కరోనా విషయంలో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు మరింతగా భయపెట్టాయి. సంబంధం లేని వీడియోల్ని షేర్ చేసి కరోనాతో జత చేయడం, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే విధంగా పోస్టులు పెట్టడం సర్వ సాధారణంగా మారింది. వాట్సప్ యూనివర్శిటీ వార్తలు హల్‌చల్ చేశాయి. అసలు కంటే అసత్యమే ఎక్కువగా ప్రచారమైంది.ఈ క్రమంలో కరోనా విషయంలో జరిగిన అసత్య ప్రచారం ఏయే దేశాల్లో ఎక్కువగా జరిగిందనే విషయంపై ఆసక్తికరమైన అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం వివరాలు సేజెస్ ఇంటర్నేనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఇనిస్టిట్యూషన్ జర్నల్‌లో ప్రచురితమైంది.
కరోనా సంక్రమణ(Corona Spread) విషయంలో కరోనా సంబంధిత వార్తల్లో జరిగిన ప్రచారంపై 138 దేశాల్లో పరిశోధన జరిగింది. అత్యధికంగా అసత్య ప్రచారం ఏయే దేశాల్లో జరిగిందనేది జాబితా వెలువరించింది. ఈ జాబితాలో ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. ఇండియాలో ఇంటర్నెట్ విరివిగా అంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండటం, అదే సమయంలో ఇంటర్నెట్ పరిజ్ఞానం సరిగ్గా లేకపోవడం కారణాలుగా అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 138 దేశాల్లో 9 వేల 657 ప్రాంతాల్నించి సమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా సేకరించారు. ఈ సమాచారాన్ని ఫ్యాక్ట్‌చెక్ (Fact check)చేసేందుకు 94 సంస్థల సహాయం తీసుకున్నారు. ఇందులో ఇండియా 18.07 శాతంతో ప్రపంచంలో అత్యధిక కరోనా అసత్య ప్రచారాన్ని సాగించినట్టు పరిశోధనలో వెల్లడైంది. ప్రత్యేకించి సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారం ప్రచారమైంది. సోషల్ మీడియా వినియోగం ఇండియాలో ఎక్కువగా ఉండటం దీనికి కారణంగా ఉంది.
కరోనా అసత్య సమాచారాన్ని(Corona False Information) ప్రచారం చేసిన దేశాల్లో ఇండియా 18.07 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, అమెరికా 9.74 శాతంతో రెండవ స్థానంలో నిలిచింది. బ్రెజిల్ 8.57 శాతంతో మూడవ స్థానంలోనూ, స్పెయిన్ 8.03 శాతం నాలుగవ స్థానంలోనూ నిలిచాయి.ఇందులో సోషల్ మీడియాలో 84.94 శాతం మంది, ఇంటర్నెట్‌లో 90.5 శాతం మంది అసత్య సమాచారం పోస్ట్ అయ్యాయి. ఫేస్‌బుక్ మాధ్యమం ద్వారా 66.87 శాతం అసత్య సమాచారం ప్రచారమైంది.
Also read: AP High Court: జిల్లా పరిషత్ ఎన్నికలు తిరిగి నిర్వహిస్తారా..ఇవాళే హైకోర్టు తీర్పు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook