White King Cobra Surgery Viral Video: తీవ్రంగా గాయపడ్డ నాగుపాము.. కుట్లు వేసి కాపాడిన డాక్టర్! వీడియో చూస్తే పాపం అనకుండా ఉండరు
King Cobra Surgery Viral Video, Vizag Doctor stitches Injured Cobra and Saved Life. సాటి మనిషికి కష్టమొస్తే పట్టించుకోని ఈ రోజుల్లో ఓ వ్యక్తి గాయపడ్డ నాగుపాముకి చికిత్స చేయించి తన మంచితనాన్ని చాటుకున్నాడు.
Snake Catcher Kiran Saved Seriously Injured King Cobra in Vizag: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఉద్యోగం, కుటుంబం అంటూ తీరిక లేకుండా ఉంటున్నారు. పక్కింట్లో ఏం జరుగుందో కూడా తెలియదు కొందరికి.. ఇంకొందరు మాత్రం ఏం జరిగినా పట్టించుకోరు కూడా. సాటి మనిషికి కష్టమొస్తే పట్టించుకోని ఈ రోజుల్లో ఓ వ్యక్తి గాయపడ్డ విష సర్పానికి చికిత్స చేయించి తన మంచితనాన్ని చాటుకున్నాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రం ఏపీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... విశాఖపట్నం జిల్లాలోని గాజువాక ప్రాంతంలో మూడు రోజుల క్రితం ఓ భారీ నాగుపాము (కింగ్ కోబ్రా) గాయపడింది. ఇంటి పై నుంచి కింద పడడంతో నాగుపాముకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. గాయాలు అవడంతో ఆ పాము అక్కడి నుంచి కడలేకపోయింది. ఇది చూసిన ఆ ఇంటి సభ్యులు నాగుపామును చంపకుండా.. స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం ఇచ్చారు. అతడు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి చూడగా.. నాగుపాముకు తల భాగంలో గాయాలు అయ్యాయి. ఇది చూసిన కిరణ్ చలించిపోయి దానిని పట్టుకునాడు.
పామును స్నేక్ క్యాచర్ కిరణ్.. గాంధీగ్రామ్ పశువైద్యశాలకు తీసుకెళ్లాడు. తల భాగంలో గాయపడ్డ నాగుపాముకు గాంధీగ్రామ్ పశువైద్యశాల డాక్టర్ సునీల్ కుట్లు వేసాడు. కుట్లు వేస్తుండగా పాము కదలకుండా కిరణ్ దాని తల భాగాన్ని పట్టుకోగా.. ఇంకొకరు తోకను పట్టుకున్నాడు. అచ్చు మనిషికి కుట్లు వేసినట్టే డాక్టర్ సునీల్ పాముకు కూడా వేశాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డాక్టర్ సునీల్ పాముకు కుట్లు వేయడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. స్నేక్ క్యాచర్ కిరణ్, డాక్టర్ సునీల్ చేసిన ఈ పనికి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'మీరు సూపర్ బాస్' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'గ్రేట్ హుమాలిటీ' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. మీరు కూడా వీడియో చూడండి. పాము కాస్త కోలుకున్న తర్వాత అడవిలో వదిలిపెడతారట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.