Viral Video: అమాయకంగా కన్పిస్తే చాలు రోడ్డుపై జరిగే చిన్న చిన్న ఘటనలకు కూడా అమ్మాయిలు రెచ్చిపోతుంటారు. ఓ అమాయక ఈ రిక్షా డ్రైవర్‌పై ఆ మహిళ అలానే విరుచుకుపడింది. చివరికి సంకెళ్లు పడ్డాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోడ్డుపై వెళ్తున్నప్పుడు చిన్న చిన్న ఘటనలు సర్వ సాధారణం. పెద్ద వాహనానికి చిన్న వాహనం ఎప్పుడూ లోకువే. అందులో ఇటీవల సోషల్ మీడియా కారణంగా రోడ్డుపైనే అమాయకుల్ని కూడా చితకబాదుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అటువంటిదే ఓ ఘటన నోయిడాలో జరిగింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 


అతడొక నిరుపేద. ఈ రిక్షా తొక్కుకుంటూ జీవితం గడుపుతుంటాడు. అతడి ఈ రిక్షా పొరపాటున మారుతి వేగన్ ఆర్ కారుకు టచ్ అయింది. అంతే..ఆ కారులోని మహిళకు తెగ కోపమొచ్చేసింది. ఆ అమాయక డ్రైవర్‌ను చొక్కా పట్టుకుని రోడ్డుపై అటూ ఇటూ తిప్పుతూ తిట్లు లంకించుకుంది. సెకన్ల వ్యవధిలో అత్యంత దారుణంగా లెంపకాయలు కొట్టడం ప్రారంభించింది. సరిగ్గా లెక్కపెడితే కేవలం 90 సెకన్ల వ్యవధిలో 17 సార్లు లెంపకాయలు కొట్టినట్టు తెలుస్తుంది. అంటే ఎంత దారుణంగా వ్యవహరించిందో అర్దం చేసుకోవచ్చు.


చేసిన తప్పుకు ఆ నిరుపేద ఈ రిక్షా డ్రైవర్ చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నా..ఆ మహిళ కనికరించలేదు. చాలా దారుణంగా వ్యవహరించింది. చొక్కా పట్టుకుని తిప్పుతూ, లెంపకాయలు కొడుతూ హింసించింది. ఈ ఘటనపై నోయిడా పోలీసులు దర్యాప్తు చేశారు. బహిరంగంగా ఈ రిక్షా డ్రైవర్‌ను కొట్టిన ఘటనలో మహిళను అరెస్టు చేశామని నోయిడా పోలీసులు తెలిపారు.



ఈ వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం కేవలం 90 సెకన్లలో కనీసం 17 సార్లు ఆ మహిళ..డ్రైవర్‌ను లెంపకాయలు కొట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. చొక్కా కాలర్ పట్టుకుని కారుని టచ్ చేసిన గుర్తుల్ని చూపిస్తూ అత్యంత దారుణంగా హింసించింది. చేసిన అతికి ఇప్పుడు అరెస్టై పోలీస్ స్టేషన్‌లో ఉంది. 


Also read: Pakistani Artist Gift: భారత దేశ ప్రజలకు పాకిస్తానీ కళాకారుడి అద్భుత గిఫ్ట్.. వీడియో వైరల్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook