Women Eating Live Rare Snakes Full Video Watch Now: ఒక్కొక్క దేశ ప్రజలు ఒక్కొక్క ఆహార రీతిని కలిగి ఉంటారు. కొన్ని దేశాల్లో పచ్చి ఆకుకూరలు తింటే మరికొన్ని దేశాల్లో మాత్రం పచ్చి జంతువులను తింటూ ఉంటారు. ఇవి పూర్వికులు ఆహార అలవాట్ల నుంచి వస్తున్నాయి. అందుకే ప్రపంచం విభిన్న ఆహార రుచుల సమ్మేళనం. చాలామంది బ్రతకడానికి ఆహారం తీసుకుంటే.. కొంతమంది తినడం కోసమే బ్రతుకుతారు. ప్రపంచంలో ఇలా చాలామంది ఉన్నారు. అలాగే జీవితమే ఒక రుచిగా అనుకోని కూడా ఆహారాలు తీసుకునేవారుంటారు. వీరినే భోజన ప్రియులు అంటారు. వీరు ఎప్పుడు ఏదో కొత్త రకమైన వంటకాన్ని తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరగడం కారణంగా ఫుడ్ బ్లాగర్స్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. వీరు ఏ ఆహారాలు పడితే అవి తింటూ ఉంటారు. అయితే ఇటీవలే ఓ ఫుడ్ బ్లాగర్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ అవుతున్న వీడియో ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..




COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగినప్పటి నుంచి యూట్యూబ్ లో కొత్త కొత్త ఫుడ్ బ్లాగర్స్ పుట్టుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ యువతి తిన్న ఆహారానికి సంబంధించిన వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆమె తిన్నది ఏంటి? వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ యువతి ఏకంగా బ్రతికి ఉన్న పాములను తినడం మీరు గమనించవచ్చు. అయితే ఆమె ఏ మాత్రం వాటిని లెక్కచేయకుండా ఒక బౌల్లో ఉన్న చిన్న చిన్న పాము పిల్లలను నమిలి తినడం మీరు గమనించవచ్చు. చాలామంది పొడవైన నూడిల్స్ తినడం మనం తరచుగా చూస్తూ ఉంటాం కానీ ఈ అమ్మాయి మాత్రం ఏకంగా పాము పిల్లలను తినడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అలాగే ఈ అమ్మాయి ఏ మాత్రం భయం లేకుండా వాటిని ముట్టుకొని మరీ నోట్లో పెట్టుకొని నమిలి మింగేస్తోంది.


Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?


ఇక ఈ వీడియోను jboobx.creatives అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ప్రస్తుతం దీనిని చూసిన నెటిజన్స్ వారి అభిప్రాయాలను కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికీ ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా వీక్షించినట్లు సమాచారం. అలాగే దీనిని ఒక లక్షకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేశారు. ఇక ఈ వీడియో పై నెటిజన్స్ స్పందిస్తున్న వివరాల్లోకి వెళితే.. ఇది నిజమైన వీడియో కాదని కొంతమంది కావాలని.. AI ద్వారా పాములు తింటున్నట్లు వీడియో తయారు చేసి పోస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఇక మరి కొంతమంది అయితే ఇలా ఎలా పాములను తింటున్నావ్? చూస్తేనే మాకు వాంతింగ్ వస్తోంది.. ఇలాంటి వీడియోలు మరోసారి పోస్ట్ చేయొద్దు అని మరి కొంతమంది నెటిజన్స్ అంటున్నారు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం పాములను తినడం నిజమేనని మరికొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అంటున్నారు.


Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook