Aunty Vs Cobra: ఆంటీల అరుపులకు జడుసుకున్న కోబ్రా..!.. గేట్ దగ్గరే మూర్ఛపోయిందిగా.. ఫన్నీ వీడియో వైరల్..
Snake Video: పాము ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఒక ఇంటి దగ్గరకు వెళ్లింది. ఇంతలో ఒక మహిళ గట్టిగా అరుస్తు పక్కనున్న వాళ్లను అలర్ట్ చేసింది. మరో మహిళ కూడా గట్టిగా అరుస్తూ రచ్చ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Snake viral video: సోషల్ మీడియాలో పాముల వీడియోలకు ఫుల్ డిమాండ్ ఉందని చెప్పుకొవచ్చు. ప్రతిరోజు పాములకు చెందిన వెరైటీ వెరైటీ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. నెటిజన్లు కూడా ఈ వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇదిలా ఉండగా.. కొన్నిసార్లు పాములు మన ఇంటి పరిసరాల్లోకి వస్తుంటాయి. కొందరు గమనిస్తే వెంటనే స్నేక్ సొసైటీ వాళ్లకు చెప్తుంటారు.
మరికొందరు పాముల మీదకు దాడులు చేస్తుంటారు. కానీ పాముల్ని చంపొద్దని పండితులు చెబుతుంటారు. పాములకు చెందిన వీడియోలను చూసేందుకు నెటిజన్లు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఒక ఫన్నీ పాముల వీడియో నెట్టింట తెగ సందడి చేస్తొంది.
ఈ వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక పాము ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. అది ఒక ఇంటి దగ్గరకు వచ్చింది.ఆ ఇంటి నుంచి ఒక మహిళ పామును గమనించింది. వెంటనే గట్టిగాకేకలు వేస్తూ.. హల్ చల్ చేసింది. అది మరో ఇంటికివెళ్తేందుకు ప్రయత్నించింది.
ఆ ఇంటి నుంచి మరో మహిళ వచ్చి రౌండప్ చేసేశారు. అది పాపం.. ముందుకు వెళ్లలేక వెనక్కు రాలేక ఇబ్బందులు పడినట్లు తెలుస్తొంది. మరికొందరు దూరం నుంచి ఆ పామును ఏమనొద్దని.. అపకారం తలపెట్టవద్దని గట్టిగా కేకలు పెడుతున్నారు.
Read more: Viral Video: వామ్మో.. దిండు కింద ప్రపంచంలోనే అత్యంత విషసర్పం.... షాకింగ్ వీడియో వైరల్..
మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. పాపం.. ఇద్దరు మహిళలు గట్టిగా అరవడం వల్ల పాము జడుసుకున్నట్లు ఉందని కూడా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.