Blue Snake Video Watch: ప్రపంచంలోనే అందమైన పాము.. వీడియో చూస్తే మీరే అంటారు..
Blue Snake Viral Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్లూ రేసర్స్ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో ఏం ఉందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Blue Snake Viral Video Watch Here: మనం చాలా చోట్ల ఒకే రంగు కలిగిన పాములను చూసి ఉంటాం.. అంతేకాకుండా ఒకే రంగులో ఉన్న కట్ల పాములను చూస్తూ ఉంటాం.. కానీ కొన్ని చోట్ల అరుదైన రంగులతో కూడిన పాములు కూడా ఉంటాయి. ఈ పాములు చూడడానికి చాలా ఆకర్శినీయంగా కనిపిస్తాయి. కానీ ఈ పాములు చాలా డేంజర్.. ఇవి అరుదుగా కనిపించినప్పటికైనా కళ్లలోకి విషం సైతం విషం చిమ్మకలవట.. అంతేకాకుండా దీని కాటు ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఈ పాములను బ్లూ రేసర్స్ కూడా అంటారు. ఇవి ఎక్కువగా ఉత్తర అమెరికాలోని కొన్ని ఆటవి ప్రాంతాలలో నివసిస్తాయి. అలాగే ఇందులో కొన్ని పాములు నీలం రంగులో ఉండడమే కాకుండా బూడిద రంగు మచ్చలను కూడా కలిగి ఉంటాయట. దీంతో పాటు ఇవి కేవలం రెండు మీటర్ల వరకు మాత్రమే పెరుగుతాయని సమాచారం. అయితే ఇందులో కొన్ని పాములు మాత్రం దాదాపు మూడు నుంచి నాలుగు మీటర్లు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ పాము కన్ను భాగం చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. దీని కంటి చుట్టూ రెండు ప్రియోక్యులర్‌లు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ పాముకు దాదాపు 11 ఉపజాతులు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి బ్లూకలర్‌కి సంబంధించిన ఓ పాములు వైరల్ అవుతోంది. జురాసిక్ జంగిల్ అనే యూట్యూబ్ చానెల్ నుంచి ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ నెటిజన్ ఈ పామును తన కాలుకు చుట్టుకుని చూపిస్తున్నట్లు మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఆ యువకు ఈ బ్లూ రేసర్స్‌ను తన చేతులకు కూడా చుట్టుకున్నాడు. అయితే ఇలాంటి ప్రమాదకరమైన పాములను కూడా పెంచుకునేవారు ఉంటారా? అని అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రస్తుతం చాలా మంది పెంపుడు జంతువులు లాగా పాములను కూడా పెంచుకుంటున్నారు. ఇది కూడా పెంపుడు పామని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరల్ అవుతున్న రీల్‌ను జురాసిక్ జంగిల్ అనే యూట్యూబ్ చానెల్ షేర్ చేశారు. దీనిని ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మందికి పైగా లైక్ చేశారు. అంతేకాకుండా 5 వేల మందికి పైగా కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి పనులను పెంచుకునే క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.