Costliest Hand Bags in the World | ప్రపంచంలోనే ఎన్నో విలువైన వస్తువుల గురించి మీకు ఇంతకు ముందు తెలియజేశాం.ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ గురించి మీకు తెలియజేస్తాం. ఈ బ్యాగ్ విలువ కేవలం రూ.53 కోట్లు మాత్రమే. మరి కొనాలని ఆలోచిస్తున్నారా.. లేదా అంత కాస్ట్ లీ బ్యాగ్ ఎందుకు బుజ్జి..వెయ్యో రెండువేలో పెట్టి మంచి బ్యాగు కొను చాలు అంటారా...అది మీ ఇష్టం. కానీ దాని ప్రత్యేకతలు మాత్రం మీరు తెలుసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Winter Foods For Dry Skin: చలికాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే పాటించాల్సిన డైట్


ఈ బ్యాగును ఇటలీకి (Italy) చెందిన లగ్జరీ బ్యాగులు తయారు చేస సంస్థ బోరిని మిలనేసి (Boarini Milanesi) తయారు చేసింది. దీని విలువ రూ.53 కోట్లు మాత్రమే అని సంస్థ తెలిపింది. ఇలాంటి బ్యాగులను కేవలం మూడు మాత్రమే తయారు చేయనుందట. ఇలాంటి అరుదైన బ్యాగులు కొనడానికి ప్రత్యేకమైన అభిరుచి గల వ్యక్తులు సిద్ధంగా ఉంటారు అని.. వారి కోసం నిత్యం కొత్తగా ప్రయత్నిస్తాం అని సంస్థ తెలిపింది.




Also Read | Wierd News: పెళ్లికూతురు వద్దంది అని.. తనను తానే పెళ్లి చేసుకున్నాడు…


ఎందుకంత ఖరీదు?
ఈ బ్యాగు ధర ఇంత ఉండటానికి కారణం...దీన్ని తయారుచేయడానికి సుమారు 1,000 గంటల సమయం పడుతుందట. దాంతో పాటు వీటిని సెమీ ఆలిగేటర్ స్కిన్ తో తయారు చేస్తారు. దీనిపై వజ్రాలు (Diamond) కూడా పొదుగుతారు. ఈ బ్యాగు అమ్మగా వచ్చిన లాభాలన్ని సముద్రాలను శుభ్రం చేసేందుకు వినియోగిస్తారట. 


Also Read | Winter Foods For Dry Skin: చలికాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే పాటించాల్సిన డైట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook