Amarnath Yatra 2024: మంచు కొండల్లో ప్రతి యేడాది సహజ సిద్ధంగా ఏర్పడే అమరనాథ్ మంచు శివ లింగాన్ని దర్శించుకోవడానికి భారత్ నుంచే కాకుండా.. దేశ, విదేశాల నుంచి ఎంతో మంది శివ భక్తులు ఇక్కడికీ విచ్చేస్తుంటారు. ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు (15 ఏప్రిల్) ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 52 రోజుల పాటు యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జగరనున్నాయి. ఈ యాత్ర కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతియేడు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తూ ఉంటుంది. ఈ యాత్రకు సంబంధించి జమ్మూ కశ్మీర్ పరిపాలన విభాగం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమర్‌నాథ్‌లో విధులు నిర్వహిస్తోన్న వైద్యుల సెలవులను రద్దు చేసింది. ఈ యాత్ర ఆగష్టు 19 వరకు కొనసాగనుంది. ఈ యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో అమర్‌నాథ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఉదయం, సాయంత్రం వేళల్లో అమర్‌నాథ్ హారతిని భక్తుల కోసం ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమర్‌నాథ్ మంచు గుహ రాజధాని శ్రీ నగర్ నుంచి 141 కిలో మీటర్ల దూరంలో ఉంది. మరియు సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తైన లోయలో ఈ గుహ కొలువై ఉంది. అమర్ నాథ్ మంచు గుహ యేడాది మొత్తం హిమానీ నదాలు.. మంచుతో  కప్పబడి ఉంటుంది.


అత్యంత సాహోసోపేతమైన అమర్‌నాథ్ యాత్ర.. రెండు మార్గాల్లో కొనసాగుతుంది. ఒకటి దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని పహల్గామ్ మార్గంలో 48 కిలో మీటర్ల మార్గం మొదటిది. రెండోది సెంట్రల్ కశ్మీర్‌లోని గందర్ బాల్ జిల్లాలోని 14 కిలో మీటర్ల ఏటవాలుగా ఉండే బల్తాల్ మార్గం. ఈ రెండు మార్గాల నుంచి ఒకేసారి యాత్ర ప్రారంభం కానున్నట్టు అధికారులు తెలిపారు. అమర్ నాథ్ యాత్ర నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పోలీసు, ఆర్మీ, రక్షణ బలగాలను పెద్ద మోహరించనుంది. అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్‌ను నేషనల్ బ్యాంక్ 316 శాఖలు, జమ్మూ కశ్మీర్ బ్యాంక్ 90 శాఖలు, యోఎస్ బ్యాంకు 37 శాఖలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 99 శాఖలతో పాటు దేశ వ్యాప్తంగా 545 పైగా వివిధ నేషనలైజ్డ్ బ్యాంక్ శాఖలలో అమర్ నాథ్ యాత్రా ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. యాత్ర చేసేవాళ్లకు ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరి.



అమర్ నాథ్ యాత్రలో  శివ భక్తులు గుహను చేరుకోవడం అతి పెద్ద సమస్యగా మారుతోంది. గందేర్బల్ జిల్లాలోని బల్తాల్ బేస్ లేదా అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాం బేస్ నుంచి భక్తులు నడుస్తూ వెళ్లాల్సి వస్తోంది. కొంత మంది గాడిదలు, గుర్రాలపై వెళుతుంటారు. మరికొందరు డోలీల సాయంతో వెళ్తారు. డబ్బున్న వాళ్లు హెలికాప్టర్లలో వెళుతున్నారు. ఏ విధంగా వెళ్లినా.. అమర్ నాథ్ యాత్ర ఎన్నో గట్టి సవాళ్లతో కూడి ఉంటుంది. దీనికి కారణం సరైన రహదారి సౌకర్యం లేకపోవడమే. జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం చేసిన తర్వాత.. భక్తుల సౌకర్యార్ధం.. బల్తాల్ బేస్ నుంచి అమర్‌నాథ్ గుహ వరకు రోడ్డు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబర్‌లో నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఆర్మీకి చెందిన బార్డర్ సెక్యూరిటీ వాళ్లు ఈ రోడ్డును నిర్మించారు. త్వరలో పూర్తి స్థాయిలో ఈ రహదారి భక్తులకు అందుబాటులోకి రానుంది.


Read More: Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter