Apara Ekadashi 2022: మరి కొద్దిరోజుల్లో హిందూవులు అతి పవిత్రంగా భావించే అపర ఏకాదశి వస్తోంది. ఆ రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయనేది నమ్మకం. అదే అపర ఏకాదశి వ్రతం. ఆ వ్రతం గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మే 26వ తేదీ గురువారం నాడు అపర ఏకాదశి ఉంది. ఆ రోజు జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్షం ఏకాదశి. శ్రీకృష్ణుడు..యుధిష్టరునికి అపర ఏకాదశి వ్రతం గురించి వివరించాడు. ఈ వ్రతం ఒక మోక్షదాయని అని..ఇది ఆచరిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు వివరించాడు. ప్రేతయోనిలో ఉండే జీవాత్మ ఈ వ్రతం ద్వారా అక్కడి నుంచి విముక్తి పొంది స్వర్గానికి చేరుతుందని చెబుతాడు. ఈ వ్రతాన్ని ఆచరించినవారికి మోక్షప్రాప్తి లభిస్తుందట. అపర ఏకాదశి వ్రతం ఆచరించేవారు కొన్ని విషయాల్ని తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. 


అపర ఏకాదశి ఆచరించాల్సిన సమయం


జ్యేష్ఠ ఏకాదశి ప్రారంభం మే 25వ తేదీ బుధవారం నాడు ఉదయం 10 గంటల 32 నిమిషాల్నించి మే 26వ తేదీ గురువారం నాడు ఉదయం 10 గంటల 54 నిమిషాల వరకూ ఉంటుంది. మే 26 ఉదయం నుంచి పూజకు ముహూర్తం ప్రారంభమవుతుంది. మే 27వ తేదీ శుక్రవారం నాడు ఉదయం 5 గంటల 25 నిమిషాల నుంచి 8 గంటల 10 నిమిషాల వరకూ ఉంటుంది.


అపర ఏకాదశి నాడు ఏం చేయకూడదు


ఏకాదశి వ్రతం నాడు బియ్యం, వంకాయలు, క్యారెట్, వంటివి తినకూడదు, వ్రతానికి ఒకరోజు ముందు మాంసం, మద్యం, మసూర్ దాల్ తినకూడదు. వ్రతం ఆచరించేవారు స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉండాలి. ఈ రోజు పూర్తిగా బ్రహ్మచర్యం పాటించాలి. వ్రతం ఉన్నప్పుడు అబద్ధాలడకూడదు. కోపం ఉండకూడదు. అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవావాళ్లు ఇతరుల్ని నిందించడం, దూషించడం, దొంగతనం వంటివాటి నుంచి దూరంగా ఉండాలి. ఏకాదశి నాడు వెంట్రుకలు, గోర్లు కత్తిరించకూడదు. ఏకాదశి నాడు ఇంట్లో చీపురు వాడకూడదు. ఎందుకంటే చిన్నచిన్న జీవాలు కీటకాలు, చీమలు వంటివి చనిపోయే ప్రమాదముంది. ఇది జీవహత్య కిందకు వస్తాయి.


ఏకాదశి వ్రతాన్ని పవిత్రమైందిగా భావిస్తారు. ఎందుకంటే ఇది మోక్షప్రదాయిని. మనసులో కోరికల్ని పూర్తి చేస్తుంది. విష్ణుదేవుని దయతో అన్ని కష్టాలు దూరమౌతాయి. ఏకాదశి వ్రతం నెలలో రెండుసార్లు వస్తుంది. ఒకటి కృష్ణపక్షంలో రెండవది శుక్ల పక్షంలో. ఓ విధంగా చూస్తే..ఏడాదిలో 24 ఏకాదశి వ్రతాలు వస్తాయి. అన్నింటికీ విశేష ప్రాధాన్యత ఉంది. 


Also read: Lakshmi Devi Signs: మీ ఇంట్లో ఆ సంకేతాలు కన్పించాయా..అయితే మీ ఇంట్లో డబ్బులు వచ్చి పడతాయి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook