మార్చ్ నెలలో సూర్య, గురు గ్రహాలు మీనరాశిలో ప్రవేశించనున్నాయి. అటు బుధుడు కూడా మీనంలో ప్రవేశించడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడనుంది. అనంతరం బుధుడు మీనరాశి నుంచి మేషరాశిలో గోచారం చేయనున్నాడు. ఈ మార్పులతో చాలా రాశులపై స్పష్టమైన ప్రభావం పడుతుంది. గ్రహాల గోచారం ఫలితం పదోన్నతి, ఇంక్రిమెంట్లపై పడనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రహాల స్థానంలో మార్పు కారణంగా అన్ని రాశుల జీవితాలపై ప్రభావం పడుతుంటుంది. జ్యోతిష్యం ప్రకారం మార్చ్ నెలలో గ్రహాల స్థితిలో మార్పు ఉంటుంది. దీని ప్రభావం వివిధ రాశులపై పడుతుంది. మార్చ్ నెలలో మంగళ గ్రహం మిధున రాశిలో ప్రవేశించడం, శుక్రుడు మేష రాశిలో ప్రవేశించడం ఉంటుంది. దీంతో పాటు సూర్య, గురు గ్రహాలు మీనరాశిలో ప్రవేశించనున్నాయి. బుధుడు కూడా మీనరాశిలో ప్రవేశించి..బుధాదిత్య యోగం ఏర్పర్చనున్నాడు. యోగం ఏర్పర్చిన తరువాతా బుధుడు మీనరాశి నుంచి బయటికొచ్చి మేష రాశిలో ప్రవేశిస్తాడు. ఈ విధమైన కీలకమైన మార్పులు చాలా రాశులపై ఉంటుంది. మీ ఇంక్రిమెంట్లు, పదోన్నతిపై ప్రభావం చూపిస్తుంది. ఏయే రాశులపై శుభంగా ఉంటుందో తెలుసుకుందాం..


వృషభ రాశి


మార్చ్ నెలలో ఏర్పడనున్న సంయోగం లేదా యుతి కారణంగా వృషభ రాశివారికి చాలా లాభం కలగనుంది. ఈ రాశివారి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్ సంబంధిత అవకాశాలు లభిస్తాయి. పనిచేసే చోట అద్భుత అవకాశాలు లభిస్తాయి. మీ పనిని గుర్తిస్తారు.


మిథున రాశి


మిథున రాశిలో మంగళ గ్రహం ప్రవేశంతో ఈ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కెరీర్ సంబంధిత విషయాల్లో లాభం కలుగుతుంది. ధైర్యం, పరాక్రమం పెరుగుతాయి. మీకు తెలిసినవారి నుంచి చాలా లాభం కలుగుతుంది. 


కర్కాటక రాశి


కర్కాటక రాశి జాతకులకు మార్చ్ నెల చాలా కీలకం. ఉద్యోగులకు వృద్ధి కలుగుతుంది. వ్యాపారులకు ఊహించని లాభాలు కలుగుతాయి. విదేశాల్లో పనిచేసేవారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. 


తుల రాశి


తుల రాశి జాతకులకు ఈ నెల లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది. పనిచేసే చోట గౌరవం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. విద్యార్ధులు ఉన్నత చదువులు చదవనున్నారు. 


మీన రాశి


జ్యోతిష్యం ప్రకారం మీనరాశి జాతకులకు మార్చ్ నెల ఆర్ధిక విషయాల్లో ప్రయోజనం కలుగుతుంది. బుధ, గురు గ్రహాల యుతితో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. జీతంలో వృద్ధి కలగనుంది. మీనరాశివారికి ఈ నెల ఉద్యోగ సంబంధిత కొత్త అవకాశాలు లభిస్తాయి.


Also read: Planet Transit 2023: మార్చ్ నెలలో గ్రహాల గోచారం, ఆ 4 రాశులకు మహర్దశే, ఊహించని డబ్బు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook