మార్చ్ నెలలో పెద్ద పెద్ద గ్రహాలు వివిధ రాశుల్లో గోచారం చేయనున్నాయి. గ్రహాల కదలికతో 12 రాశులపై ప్రభావం పడుతుంటుంది. కానీ కొన్ని రాశుల జాతకాలకు శుభంగా ఉంటే..మరి కొన్ని రాశులకు పూర్తిగా అశుభ పరిణామాలు ఎదురౌతాయి.మార్చ్ నెలంటే గ్రహాల రాశి పరివర్తనానికి ప్రత్యేకం. ఏకంగా నాలుగు పెద్ద గ్రహాల గోచారముంది. శుక్రుడు మేషరాశిలో, మంగళ గ్రహం మిధున రాశిలో, సూర్యుడు, బుధుడు మీన రాశిలో ప్రవేశిస్తుండటంతో మూడు రాశులకు మహర్దశ పట్టనుంది.
జ్యోతిష్యం ప్రకారం బుధుడు ఈసారి రెండు సార్లు గోచారం చేయనున్నాడు. మార్చ్ 16న మీనరాశిలో ప్రవేశించి..ఆ తరువాత రెండవసారి మార్చ్ 31న మేష రాశిలో గోచారం చేయనున్నాడు.
మిధున రాశి
జ్యోతిష్యం ప్రకారం మంగళ గ్రహం మిధున రాశిలో ప్రవేశించనున్నాడు. దీనివల్ల మీ జాతకంలో ఏర్పడే ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి తప్పుతుంది. కెరీర్ విషయంలో తీసుకునే నిర్ణయాలతో లాభముంటుంది. స్నేహితుల సహకారంతో ఏదైనా పెద్ద పనిలో విజయం లభిస్తుంది. ఏదైనా పని రిస్క్‌తో ముందుకు సాగితే..విజయం తప్పకుండా ఉంటుంది. అంటే మార్చ్ నెల ఈ రాశివారికి అత్యంత లాభదాయకంగా ఉండనుంది.
కర్కాటక రాశి
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కర్కాటక రాశి జాతకుల్లో ఉద్యోగులకు అంతా బాగుంటుంది. ఈ సమయంలో ఊహించని రీతిలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ క్రమంలో ఆ అవకాశాల్ని అందిపుచ్చుకోగలిగితే విజయం లభిస్తుంది. వ్యాపారంలో కూడా లాభాలు ఆర్జిస్తారు. మహిళలకు ఈ సమయం అత్యంత అనుకూలమే కాకుండా శుభ సూచకంగా ఉంటుంది. జీవితంలో బాగా సంపాదించగలరు.
తుల రాశి
తుల రాశి జాతకులకు ఈ సమయంలో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. మీ పనికి గుర్తింపుగా పదోన్నతి లభిస్తుంది. కానీ ముందూ వెనుకా ఆలోచించకుండా ఏవిధమైన అగ్రిమెంట్ లేదా చట్టపరమైన కాగితాలపై సంతకాలు చేయవద్దు. విద్యార్ధులకు అనుకూలమైంది. ఏదైనా కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ధనలాభముంటుంది.
మీన రాశి
జ్యోతిష్యంలో మార్చ్ నెలలో 4 గ్రహాల గోచారం మీనరాశి జాతకులకు ప్రత్యేకంగా మారనుంది. ఈ రాశివారికి ఆర్ధికంగా లాభాలు కలుగుతాయి. కెరీర్‌లో అద్భుతమైన, ఊహించని వృద్ధి ఉంటుంది. ఆఫీసులో కూడా మీకు పూర్తి అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. అధికారుల సహకారం పూర్తిగా లభిస్తుంది. శాలరీ ఇంక్రిమెంట్ లభిస్తుంది. జీవిత భాగస్వామి సహకారంతో అతి పెద్ద కష్టం తొలగిపోతుంది.
Also read: Shani Mahadasha: 19 ఏళ్లపాటు ఉండే శనిమహాదశ.. మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook