September 2023 Horoscope: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ఒక్కోసారి ఒకే నెలలో ఉంటుంది. అంటే ఒకే నెలలో 2-4 గ్రహాల గోచారం చెందుతుంటాయి. జాతక రీత్యా ఇది కీలకమైన పరిణామం కానుంది. అదే విధంగా రానున్న సెప్టెంబర్ నెలలో ఏకంగా 5 గ్రహాల గోచారం ఉండనుంది. ఇది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇది చాలా కీలకం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతకాలు నమ్మేవారికి సెప్టెంబర్ నెల చాలా ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఎందుకంటే ఈ నెలలో ఏకంగా 5 గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ఉంది. గ్రహాలకు గురువుగా భావించే గురు గ్రహం సెప్టెంబర్ 4వ తేదీన వక్రమార్గం పట్టనుంది. అదే రోజు శుక్ర గ్రహం కూడా గోచారం చేయనుంది.  మరోవైపు గ్రహాల రాజకుమారుడిగా పిల్చుకునే బుధుడు సెప్టెంబర్ 16వ తేదీన గోచారం ఉంది. ఇక సెప్టెంబర్ 17వ తేదీన సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశముంటుంది. ఇక చివరిగా సెప్టెంబర్ 24వ తేదీన మంగళ గ్రహం కన్యా రాశిలో అస్తమించనుంది. ఈ ప్రభావం 12 రాశులపై వేర్వేరుగా ఉండనుంది. ఇందులో 4 రాషులకు మాత్రం ఈ నెల అంటే సెప్టెంబర్ నెల అత్యంత మహత్యం కలిగింది. అంతులేని ధన సంపదలు, ఆరోగ్యం కలగవచ్చు. 


సింహ రాశి జాతకులకు సెప్టెంబర్ నెల చాలా ముఖ్యమైంది. ఈ రాశులవారికి ఈ నెల అదృష్టం తిరగరాయనుంది. వ్యాపారస్థులకు లాభాలు పెరుగుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. పనిచేసే చోట ప్రశంసలు లభిస్తాయి. ఫలితంగా కెరీర్‌లో ముందుకెళ్లేందుకు అవకాశముంటుంది. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 


మేష రాశి జాతకులకు సెప్టెంబర్ నెలలో సానుకూల పరిణామాలు కలుగుతాయి. ఉద్యోగస్థులకు లేదా నిరుద్యోగులకు మంచి సమయం. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పొరుగువారితో సంబంధ బాంధవ్యాలు పటిష్టమౌతాయి. ఏ పని చేసినా అందులో విజయం తప్పకుండా లభిస్తుంది. ఆదాయంలో కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. పదోన్నతి, ఇంక్రిమెంట్లు తప్పకుండా ఉంటాయి. 


ఇక తుల రాశి జాతకులకు సైతం సెప్టెంబర్ నెల చాలా మహత్తు కల్గింది. ఇంటికి సంబంధించి కొత్త పరిణామం సంభవించవచ్చు. ఇళ్లు లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంటుంది. కొత్త  బాధ్యతలు చేతికి అందుతాయి. లక్ష్మీదేవి ప్రసన్నం ఉండటంతో ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. 


ఇక మిధున రాశి జాతకులకు సెప్టెంబర్ నెల అత్యంత ప్రాధాన్యత కలిగింది. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే ఆలోచన ఉంటే ఆ కోరిక కూడా పూర్తవుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులకు అత్యంత అనువైన సమయం. ఆరోగ్యానికి చాలా అనువైంది. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. 


Also read: Varalakshmi Vratham 2023: వరలక్ష్మీ వ్రతం రోజున చేయకూడని పనులు ఇవే..చేస్తే అంతే సంగతి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook