Varalakshmi Vratham 2023: శ్రావణమాసాన్ని హిందువులు అత్యంత ప్రాముఖ్యత కలిగిన నెలగా భావిస్తారు. శ్రావణమాసం రెండవ శుక్రవారం రోజున మహిళలంతా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతం రోజున స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించి ఉపవాసాలు పాటిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కొందరు మహిళలు వ్రతాన్ని ఆచరించి పదిమంది ముత్తైదులతో పసుపు, బొట్లు ఇచ్చుకుంటారు. ఇలా చేయడం వల్ల జీవితంలో కోరుకున్న కోరికలతో పాటు.. సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. చాలామంది భక్తిశ్రద్ధలతో లక్ష్మి దేవుని పూజించే క్రమంలో కొన్ని చేయకూడని పనులు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి కుటుంబంలో తీవ్ర దుష్ప్రభావాలను కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు ఈ క్రింది నియమాలు తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.
వ్రత నియమాలు:
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు నది దగ్గర్లో ఉంటే నదీ స్నానాన్ని ఆచరించడం ఎంతో మేలు.. నది దగ్గర లేని వారు ఇంట్లో ఉండే గంగాజలాన్ని స్నానం చేసే నీటిలో కలుపుకొని శరీరాన్ని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్నానం చేసిన తర్వాత పట్టు వస్త్రాలను ధరించి పూజ గదిలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత పూజకు అవసరమైన వస్తువులను మొత్తం తీసుకుని పూజను ప్రారంభించాల్సి ఉంటుంది. పూజలో భాగంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని పీఠంపై కూర్చోబెట్టి.. పాలు, పెరుగు, పంచామృతాలతోని విగ్రహానికి అభిషేకం చేయాలి. ఇలా వ్రతాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది.
వరలక్ష్మీ వ్రతం రోజున చేయకూడని పనులు ఇవే:
✡ వరలక్ష్మీ వ్రతంలో భాగంగా చేయకూడని పనులు చేయడం వల్ల జీవితంలో దరిద్రం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అమ్మవారి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాల్సి ఉంటుంది.
✡ వరలక్ష్మీ వ్రతం చేసేవారు కలశాన్ని గాజు ప్లేట్లలో పెట్టకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ పెడితే వెండి లేదా ఇత్తడి ప్లేట్లలో పెట్టడం చాలా మంచిది.
✡ చాలామంది తొందరపాటు కారణంగా ముందుగా గణేశుడి పూజకు బదులు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇలా అస్సలు చేయకూడదు ముందుగా విఘ్నేశ్వరుని పూజించి లక్ష్మీదేవి పూజను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి ముందుగా గణపతిని పూజించాల్సి ఉంటుంది.
✡ లక్ష్మీ పూజలో భాగంగా కుటుంబ సభ్యులు అంతా భక్తిశ్రద్ధలతో ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్రతాన్ని ఆచరించే మహిళలు ఉపవాసాలు తప్పకుండా పాటించాలి.
✡ వరలక్ష్మీ వ్రతం రోజున పసుపు రంగు దుస్తులను ధరించడం చాలా మంచిది. ప్రస్తుతం చాలామంది పూజలో భాగంగా ఒకసారి ధరించిన దుస్తులను మరోసారి ధరిస్తున్నారు ఇలా చేయడం చాలా తప్పని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి