Benefits Of Rahu: జ్యోతిష్యంలో రాహువు, కేతువు మరియు శని గ్రహాలను అశుభ లేదా దుష్ట గ్రహాలుగా భావిస్తారు. జాతకంలో ఈ మూడు గ్రహాల స్థానం మీ జీవితంలో అనేక మార్పులను తెస్తుంది. శనిదేవుడు బంటును కూడా రాజును చేస్తాడు. రాహువు అయితే ఏ వ్యక్తినైనా ధనవంతుడుగా చేస్తాడు, అలాగే కేతువు అసాధారణ జ్ఞానాన్ని ఇస్తాడు. ఇవి మీ జాతకంలో అశుభ స్థానంలో ఉంటే మీరు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. రాహువు ఏ సందర్భాలలో శుభ ఫలితాలను ఇస్తాడో ఈ రోజు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహువు ప్రభావం
మూడు లేదా ఆరో స్థానాల్లో ఉంటే..
రాహువు ప్రభావం ప్రజలందరిపై జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఎవరి జాతకంలో రాహువు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. ఏ వ్యక్తి జాతకంలో రాహువు మూడవ, ఆరు లేదా పదకొండవ స్థానంలో ఉంటాడో వారు ఎల్లప్పుడూ శుభఫలితాలనే పొందుతారు. మీలో ధైర్యం పెరుగుతుంది. మీర శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు రుణ విముక్తి పొందుతారు. అన్ని రకాల సమస్యలను అధిగమిస్తారు. 


పదో స్థానంలో ఉంటే..
మీజాతకంలో రాహువు 10వ స్థానంలో ఉంటే రాజయోగం ఏర్పడుతుంది. మీ దశమ స్థానంలో రాహువు కూర్చోవడం వల్ల మీరు పాలిటిక్స్ లో విజయాన్ని సాధిస్తారు. మీరు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తారు.
పదకొండవ స్థానంలో ఉంటే..
జాతకంలోని 11వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీకు మేలు జరుగుతుంది. మీ సంపద రెట్టింపు అవుతుంది. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మకర రాశిలో జన్మించిన వారికి రాహువు చాలా మేలు చేస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతారు.


Also Read: Mangal Gochar 2023: మిథునరాశిలో సంచరిస్తున్న కుజుడు.. ఈ 3 రాశులకు మే 10 వరకు డబ్బే డబ్బు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి