Surya Grahan- Corona Cases: సూర్యగ్రహణం, ఇండియాలో కరోనా కేసులు, పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితికి మధ్య సంబంధం ఏంటి..?
Link Between Surya Grahanam 2023- Pakistan`s economic situation: ఏప్రిల్ 20న మెుదటి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంఘటనలకు కారణమయ్యే అవకాశం ఉంది. గతంలో చైనాలో కరోనా ప్రబలినప్పుడు సూర్యగ్రహణం కనిపించింది. ఈసారి ఏం జరుగుతుందోనని ప్రజల్లో ఆందోళలన ఉంది.
Link Between Surya Grahanam 2023 - Corona Cases in India: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం మరో రెండు వారాల్లో అంటే ఏప్రిల్ 20న రాబోతుంది. అయితే ఇది ఇండియాలో కనిపించదు, సూతక్ కాలం కూడా చెల్లదు. సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం కారణంగా గ్రహాలు మరియు రాశులలో మార్పులు ఉంటాయని నమ్ముతారు. దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు మరియు కొన్ని అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటాయి. అయితే జ్యోతిష్యశాస్త్ర లెక్కల ప్రకారం, చైనాలో కరోనా మెుదలైనప్పుడు సూర్యగ్రహణం కనిపించింది. మరి ఈ సారి ఏర్పడబోయే సూర్యగ్రహణం ఏమి తెస్తుందో తెలుసుకుందాం.
ఇండియాకు కరోనా ముప్పు
ఏప్రిల్ 20న సంభవించనున్న సూర్యగ్రహణం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ మరియు పాపువా న్యూ గినియా వంటి దేశాలలో మాత్రమే కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం, ఈ దేశాల్లో ఉదయం 7.05 గంటల నుంచి 12.39 గంటల వరకు ఈ గ్రహణం కనిపిస్తుంది. సూర్యచంద్రులు అశ్వినీ నక్షత్రంలో ఉండగా ఈ గ్రహణం గురువారం ఏర్పడుతుంది. అశ్విని నక్షత్రం కేతువు యొక్క నక్షత్రంగా భావిస్తారు. అందువల్ల, భారతదేశంతో సహా ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
Also Read: Planet Transit 2023: మీనంలో సూర్య, బుధ , గురు గ్రహాలు, 5 రాశులకు తిరగనున్న దశ
పాకిస్థాన్ పై ప్రభావం
ఈ గ్రహణం మేషరాశిలో ఏర్పడబోతుంది. దీంతో మన పొరుగు దేశమైన పాకిస్థాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు తీసుకురాబోతుంది. రాహువు యెుక్క చెడు ప్రభావం కూడా దాయాది దేశంపై పడునుంది. దీంతో ఆ దేశం ఎన్నో నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. ఈ దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశం కనిపిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి