Venus, Jupiter & Mercury Transit 2023: మీనంలో సూర్య, బుధ , గురు గ్రహాల యుతి.. ఈ 5 రాశులకు తిరగనున్న దశ

Planet Transit 2023: ఖగోళంలో జరిగే గ్రహాల చలనాన్ని జ్యోతిష్యం మరోలా భాష్యం చెబుతుంటుంది. అదే రాశి పరివర్తనం, గ్రహాల కలయిక, యుతి ఇలా వివిధ రకాలుగా అభివర్ణిస్తుంటుంది. హిందూ జ్యోతిష్యం ప్రకారం అందుకే గ్రహాల పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 10, 2023, 01:07 PM IST
Venus, Jupiter & Mercury Transit 2023: మీనంలో సూర్య, బుధ , గురు గ్రహాల యుతి.. ఈ 5 రాశులకు తిరగనున్న దశ

Venus, Jupiter & Mercury Transit 2023: జ్యోతిష్యం ప్రకారం నిర్ణీత సమయంలో గ్రహాలు రాశి మారుతుంటాయి. దీనినే రాశి పరివర్తనమంటారు. అదే సమయంలో గ్రహాల కలయిక లేదా యుతి ఏర్పడుతుంటుంది. గ్రహాల యుతి కారణంగా అన్ని రాశుల జాతకాలపై విశేష ప్రభావం పడనుంది. బుధ, గురు, సూర్య గ్రహాల యుతితో జరిగే ప్రభావం గురించి తెలుసుకుందాం..

హిందూ ధర్మంలో గ్రహాల పరివర్తనం లేదా గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం మీనరాశిలో గురు, బుధ, సూర్య గ్రహాలున్నాయి. ఈ మూడు గ్రహాలు కలిసి మీన రాశిలో మహా యుతి ఏర్పర్చం వల్ల 5 రాశుల జీవితం మారిపోనుంది. ఊహించని అదృష్టం కలిసి రానుంది. ఎందుకంటే మీనరాశిలో 3 మహత్యపూర్వక గ్రహాలు కలిశాయి. దీనివల్ల ఈ 5 రాశులకు అత్యంత లాభదాయకం కానుంది. సూర్యుడిని విజయం, ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా భావిస్తే. గురు గ్రహాన్ని సౌభాగ్యం, పెళ్లి, సుఖాలకు కారకుడిగా చెబుతారు. ఇక బుధుడిని ధనం, వ్యాపారం, బుద్ధికి ప్రతీక అంటారు. మీనరాశిలో ఈ మూడు గ్రహాలు కలవడం వల్ల అన్ని రంగాలపై ప్రభావం పడనుంది. సూర్య, బుధ, గురు గ్రహాల యుతి కారణంగా లాభపడనున్న రాశుల గురించి తెలుసుకుందాం.

సింహ రాశి

మీన రాశిలో సూర్య, బుధ, గురు గ్రహాలు కలిసి మహా యుతి ఏర్పాటు చేయడం వల్ల ఈ రాశిపైనే అత్యంత సానుకూల ప్రభావం కన్పిస్తుంది. ఈ రాశి జాతకులకు ఊహించని సంపద, డబ్బు లభిస్తాయి. పేరు, ప్రఖ్యాతులు ఉంటాయి. బ్యాంకు బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది. ఆకశ్మిక ధనలాభముంటుంది. పెట్టుబడి లాభాల్నిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మీన రాశి

మీన రాశి జాతకులకు మూడు గ్రహాలు కలిసి మహా యుతి ఏర్పర్చడం ఊహించని లాభాలనిస్తుంది. చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీ సాహసం, పరాక్రమం పెరుగుతాయి. కష్టపడినదానికి పూర్తి ప్రతిఫలం ఉంటుంది. ఆర్ధికంగా పటిష్టమౌతారు. పోటీ పరీక్షల్లో విజయం మీదే అవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏ విధమైన సమస్యలు తలెత్తవు.

Also Read: Sun Transit 2023: ఏప్రిల్ 14న సూర్యుడు, రాహువుల కలయిక, ఈ రాశులవారి దశ తిరగబోతోంది!

మిధున రాశి

మిథున రాశి జాతకులకు మహా యుతి అత్యంత శుభదాయకం కానుంది. దీర్ఘకాలిక రోగాల్నించి విముక్తి పొందుతారు. పనిచేసే చోట అనుకూలమైన వాతావరణముంటుంది. మీ ప్రభావం, ప్రాధాన్యత పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడి కష్టాలు తొలగిపోతాయి. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. 

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి జాతకులకు సూర్య, బుధ, గురు గ్రహాల మహా యుతితో అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఉద్యోగస్థులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఖాయం. అదృష్టంగా తోడై నిలుస్తుంది. వ్యాపారులకు విశేషమైన లాభాలు కలుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి.

కర్కాటక రాశి

సూర్య, గురు, బుధ గ్రహాల మహాయుతితో cancer జాతకులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఎవరితోనైనా విభేదాలుంటే తొలగిపోతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. కెరీర్ చాలా బాగుంటుంది. ఊహించని ధనలాభం కలుగుతుంది. మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆర్ధికంగా ఇబ్బందులుండవు.

Also Read: Guru Chandala yogam 2023: ఈ నాలుగు రాశులకు ఏప్రిల్ 23 తరువాత తీవ్ర ఇబ్బందులు, ఏం చేస్తే ఉపశమనం కలుగుతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News