Astrology tips: ఏ పూవులు ఏ రోజు వాడాలి, అంతులేని సంపద, అదృష్టానికి మార్గాలు ఈ పూవులే
Astrology tips: పూజ పునస్కారాలు, శుభకార్యాల సమయంలో దేవీ దేవతల్ని ప్రసన్నం చేసుకునేందుకు పువ్వులు వినియోగిస్తుంటారు. గ్రహాల్ని శాంతింపజేసేందుకు ఏయే రకాల పువ్వుల్ని వినియోగిస్తారో తెలుసుకుందాం..
Astrology tips: పూజ పునస్కారాలు, శుభకార్యాల సమయంలో దేవీ దేవతల్ని ప్రసన్నం చేసుకునేందుకు పువ్వులు వినియోగిస్తుంటారు. గ్రహాల్ని శాంతింపజేసేందుకు ఏయే రకాల పువ్వుల్ని వినియోగిస్తారో తెలుసుకుందాం..
జీవితంలో నెగెటివిటీను దూరం చేస్తూ..శుభకార్యాల్లో సక్సెస్ కోసం పూవులు వాడుతుంటారు. పూజాది కార్యక్రమాల్లో సైతం పువ్వులు లేకుండా పని జరగదు. ప్రతిరోజూ ఒక పూవు సమర్పిస్తుంటారు. ఆ పూవును తమ వద్ద ఉంచుకుంటే..ఆ వ్యక్తికి సౌభాగ్యం లేదా అదృష్టం లభిస్తుందని అంటారు. ఎందుకంటే పూవులకు గ్రహాలకు సంబంధముంది జ్యోతిష్యశాస్త్రంలో. అందుకే గ్రహాల్ని శాంతింపజేసేందుకు పూవుల వినియోగం తప్పనిసరి.
మందారపూవుల్ని ముఖ్యంగా ఏదైనా ప్రత్యేకపని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆదివారం నాడు జేబులో ఉంచుకోవడం ఆనవాయితీ. ఇలా చేస్తే వ్యక్తి కుండలిలో సూర్యుడి బలోపేతం అవుతాడు. అదృష్టం కలిసొస్తుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తాడు. ఇక మరో ముఖ్యమైన పూవు కమలం. శుభకార్యాల్లో వ్యక్తి కుండలిలో గురుడు అంటే బృహస్పతి బలంగా ఉండటం అవసరం. వైవాహిక, ప్రేమ, ధనం, సుఖ సంతోషాలు, సంతాన ప్రాప్తి విషయాల్లో గురు గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి. అందుకే ఆదివారం నాడు కమలం పూవుల్ని చెంతన ఉంచుకుంటే..పాజిటివ్ శక్తులు ప్రసరిస్తాయి.
ఇక శని గ్రహం బలంగా ఉండేందుకు శనివారం నాడు నీలం పూవుల్ని చెంతన ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల శనిగ్రహం శుభప్రభావం ఆ వ్యక్తిపై ఉంటుంది. లావెండర్ పూవులకు కూడా జ్యోతిష్యశాస్త్రంలో ప్రాధాన్యత ఉంది. చంద్రుడు బలహీనంగా ఉంటే..చిన్న చిన్న విషయాలకు భావోద్వేగం కలుగుతుంది. దీనికోసం సోమవారం నాడు లావెండర్ పూవుల్ని చెంతన ఉంచుకోవాలి. దీనివల్ల ఆ వ్యక్తి కుండలిలో చంద్రుడు బలోపేతమై..సహాయం లభిస్తుంది.
ఇక ఎర్రటి గులాబీ పూలకు ప్రత్యేకత ఉంది. మంగళవారం నాడు మంగళగ్రహానికి సమర్పించాలి. ప్రతిరోజూ ఎర్రటి గులాబీ పూలు చెంతన ఉంచుకుంటే..శుభప్రదం కలుగుతుంది. ఇక లిల్లీ పూలకు కుండలిలోని బుధ గ్రహంతో సంబంధముంది. బుధవారం నాడు పింక్ లిల్లీ పూలను చెంతన ఉంచితే..ఆ వ్యక్తి జాతకంలో బుధుడు బలోపేతమవుతాడు. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. వయిలెట్ పూలు వ్యక్తి జీవితంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు వినియోగించాలి. ఎందుకంటే శుక్రుడు బలహీనంగా ఉంటే..వైవాహిక జీవితంలో, ఆర్ధిక జీవితంలో సమస్యలు ఎదురౌతాయి. ఈ పూలను చెంతన ఉంచుకుంటే..అదృష్టం కలుగుతుంది.
Also read: China Vastu Tips: ఆ మూడు ఫేంగ్‌షుయీ వస్తువులతో మీ ఆదృష్టం మారిపోతుంది, రేపే పెట్టండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook