China Vastu Tips: చైనా వాస్తుశాస్త్రం ప్రకారం ఫేంగ్‌షుయీ వ్యక్తి జీవితంలో సుఖసంతోషాలు వస్తాయి. ఇంట్లోని నెగెటివిటీను దూరం చేసి..పాజిటివిటీని ప్రసరితమౌతాయి. ప్రతి వ్యక్తి అదృష్టం మారిపోయే..3 వస్తువుల గురించి ఫేంగ్‌షుయీలో ప్రస్తావించారు.
మనకు వాస్తుశాస్త్రం ఎలానో చైనీయులకు ఫేంగుషుయీ అటువంటిది. ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు అభివృద్ధి మార్గాలు తెర్చుకునే ముండు వస్తువుల గురించి అందులో ప్రస్తావన ఉంది. ఈ మూడు వస్తువుల్ని ఇంట్లో లేదా ఆఫీసులో ఉంచడం వల్ల చుట్టుపక్కలంతా పాజిటివిటీ అలముకుంటుంది. ఆ వ్యక్తి జీవితంలో సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇప్పుడు మీకు..వ్యక్తి అదృష్టాన్ని తట్టిలేపి..అతడి అభివృద్ధి మార్గాలు తెరిచే ఫేంగుషుయీలో ప్రస్తావించిన మూడు వస్తువులుల గురించి వివరించనున్నాం. ఈ వస్తువుల్ని ఉంచడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుందట.
ఫేంగ్‌షుయీ ఒంటె
ఫేంగ్‌షుయీలో చాలా వస్తువుల గురించి ప్రస్తావన ఉంది. వాటిని ఇంట్లో ఉంచితే ఆ వ్యక్తి జీవితం మారిపోతుంది. ఇందులో ముఖ్యమైంది ఫేంగ్ షుయీ ఒంటె. దీనిని పోరాటానికి ప్రతీకగా చెబుతారు. ఫెంగ్‌షుయీ ఒంటెను ఇంట్లో ఉంచడం వల్ల..ఆర్ధిక సమస్యల్నించి విముక్తి లభిస్తుంది. వ్యక్తి ఆదాయంలో గణనీయమైన వృద్ధి కన్పిస్తుంది. ఆఫీసుల్లో కూడా ఉంచవచ్చు. పాజిటివిటీ కోసం ఉత్తర, పశ్చిమ దిశల్లో ఉంచాలి.
తాబేలు
ఫేంగ్‌షుయీ ప్రకారం తాబేలును ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఒకవేళ దీనిని ఉత్తర దిశలో ఉంచితే..లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుందట. వ్యాపారంలో ఆర్ధిక లాభాలు ఆర్జించేందుకు ఆఫీసులో క్రిస్టల్ తాబేలును ఉంచాలి. అయితే ఆ తాబేలుని ఏదైనా పళ్లెంలో నీళ్లు పోసి పెట్టాలి. తాబేలు ముఖం లోపలివైపుండేలా చూసుకోవాలి. అలా ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి.
ఫేంగ్‌షుయీ పిల్లి
ఫేంగ్‌షుయీ పిల్లి విగ్రహం లేదా బొమ్మ శుభసూచకంగా భావిస్తారు. హిందూమతంలో పిల్లిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు. ఒకవేళ దీనిని ఇంట్లో లేదా ఆఫీసులో ఉంచితే..సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ధనలాభం కలుగుతుంది. వేర్వేరు రంగుల బొమ్మల ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. బంగారు రంగు పిల్లి డబ్బుల్ని ఆకర్షిస్తుంది. అందుకే ఇంట్లో లేదా ఆఫీసులో బంగారు రంగు పిల్లిని ఉంచాలి. ఇంట్లో ఉత్తర తూర్పు దిశలో పచ్చరంగు పిల్లి బొమ్మను ఉంచడం వల్ల సౌభాగ్యం లభిస్తుంది.
Also read: Amarnath yatra: అమర్‌నాథ్ యాత్రకు బుకింగ్ ఎలా ? వయస్సు, కావల్సిన డాక్యుమెంట్లు
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook