Shani Pooja: ఏ వ్యక్తి కుండలిలో శని అశాంతంగా ఉంటాడో అక్కడ సమస్యలు పెరిగిపోతుంటాయి. మరి శనిని శాంతింపజేసేందుకు జ్యోతిష్యశాస్త్రంలో చాలా మార్గాలున్నాయి. ఆ మార్గాలేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రంలో శనిగ్రహానికి విశేష ప్రాధాన్యత ఉంది. శనిగ్రహం ఒకవేళ ఎవరి జాతకపు కుండలిలో అయినా..చెడు స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి చాలా సమస్యలు ఎదురౌతాయి. అటు శుభ స్థానంలో ఉంటే మాత్రం సంబంధిత వ్యక్తికి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. శని మహాదశ నుంచి ఆ వ్యక్తే కాదు..దేవతలు కూడా భయపడిపోతారు. అందుకే శనిని ప్రసన్నం చేసుకునేందుకు శాంతింపచేయాలి. జ్యోతిష్యశాస్త్రంలో దీనికి చాలా మార్గాలున్నాయి.


శనిని ప్రసన్నం చేయడంలో చందనం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పూజాది కార్యక్రమాల్లో కూడా చందనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎర్రచందనం, పసుపు చందనం, తెల్ల చందనం వంటి చాలా రకాల్ని ఉపయోగిస్తుంటారు. చందనం లేకుండా విష్ణు భగవానుడి పూజ పూర్తవదని పురాణాలు చెబుతున్నాయి. అటు శనిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు, అశుభాన్ని దూరం చేసుకునేందుకు కూడా చందనం ఉపయోగిస్తారు. చందనంలో శనిదేవుడిని ప్రసన్నం చేసే సామర్ధ్యం ఉంటుందని అంటారు. 


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చందనాన్ని నీళ్లలో వేసి స్నానం చేస్తే శని అశుభం దూరమౌతుంది. కానీ ఈ పద్ధతిని వరుసగా 41 రోజులు చేయాల్సి వస్తుంది. అప్పుడే ఈ పద్ధతి ఫలితాలనిస్తుంది. శని అశుభంగా ఉంటే..ఆ వ్యక్తికి సమస్యలు చుట్టుముడతాయి. శనిదేవుడు ఆ వ్యక్తికి నష్టాలు కల్గిస్తాడు. ఈ సమస్య నుంచి విముక్తమయ్యేందుకు శనివారం నాడు, అమావాస్యనాడు ఆముదం నూనెతో దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని రావి చెట్టు కింద...సూర్యాస్తమయం తరువాత వెలిగిస్తారు. దాంతోపాటు చందనం మాలతో జపం చేయాలి.


శనిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు శనివారం నాడు శనిదేవుడికి ఎర్రచందనం రాయాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తికి శని పీడ నుంచి విముక్తి కలుగుతుంది. 


Also read: Zodiac Sign: మేష రాశి వారు కోటీశ్వరులు కావడానికి ఈ చిన్న పని చేస్తే చాలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.