Astrology - Ketu Gochar: గ్రహ మండలంలో రాహు, కేతువులను ఛాయ గ్రహాలని పేరు. ఇవి నిరంతరం 180 డిగ్రీల కోణంలో సంచరిస్తూ ఉంటాయి. నవగ్రహాల్లో చివరిదైన కేతువు మనిషి జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ ఛాయా గ్రహాలు నిరంతరం అపసవ్య దిశలో తమ ప్రయాణాన్ని కొనాసాగిస్తూ ఉంటాయి. ఇక కేతువు కన్యా రాశిలో ప్రవేశించే సందర్భంలో ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనం చేకూరనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

astrology - Ketu Gochar:2024లో పలు గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకుంటాయి. ఈ యేడాది అనేక పెద్ద గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటున్నాయి. కేతువు మాత్రం తన స్థానాన్ని మార్చుకోలేదు. ఈ యేడాది మొత్తం కేతువు కన్యా రాశిలోనే సంచరించబోతున్నాడు.


లాస్ట్ ఇయర్ అక్టోబర్ 30న కేతువు ఈ రాశిలోకి ప్రవేశించినుంది. కేతువు యెక్క స్థానం కొన్నిరాశుల వారికి అనుకూలమైన ఫలితాలను అందిస్తోంది. 2024 లో కన్యారాశిలో ఏ రాశులపై శుభదృష్టి కేంద్రీకరించబోతున్నాడో మీరు ఓ లుక్కేయండి.


మేషరాశి:
మేషరాశి వారికి కేతువు సంచారం శుభ యోగాన్ని అందించబోతుంది. ఈ పరిస్థితుల్లో మీ ఆర్ధికంగా ఉన్నతంగా ఎదుగుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. వ్యాపారంలో దీర్ఘకాలంలో మీకు మంచి పెట్టుబడిని తెచ్చే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.


కర్కాటక రాశి:
2024లో కేతువు సంచారంతో ఈ రాశి వారికి విస్తృత ప్రయోజకరంగా ఉంటుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఇదే అనువైన సమయం. తోబట్టువులతో ఉన్న సంబంధాలు మెరుగు అవుతాయి. డబ్బు సంబంధింత సమస్యలు తొలిగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి.


వృశ్చిక రాశి:


2024 యేడాది మొత్తం వృశ్చికరాశి వారికి అంతా శుభంగా ఉంటుంది. వ్యాపారంలో ఇతరులతో మంచి భగస్వామ్యం పొందడానికి ఇదే అనువైన సమయం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. డబ్బు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే సమయంలో అనవరసరమైన ఖర్చులకు దూరంగా ఉంటే మంచిది. ఒత్తిడికి దూరంగా ఉండాలి.


Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


Also Read: Miscarriage: గర్భం కోల్పోయిన భార్య.. కన్నీటిసంద్రంలో మునిగిన స్టార్‌ క్రికెటర్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook