Venu Rahu Combination: రాహువు, శుక్ర కలయిక జాతకంలో బలంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా...
Venus Rahu Combination Effect: రాహువు, శుక్ర కలయిక జాతకంలో బలమైన స్థానంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తులపై దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా... వారికి మంచి జరుగుతుందా.. చెడు జరుగుతుందా...
Venus Rahu Combination Effect: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక కారణంగా ఆయా రాశుల వారికి శుభ, అశుభ ఫలితాలు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల కలయికకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇందులో శుక్ర-రాహు కలయిక ఒకటి. ఈ రెండు రాశుల మధ్య గురు శిష్య బంధం ఉంది. శుక్రుడు అంటే శుక్రాచార్యుడు... రాహువు శుక్రాచార్యుడి శిష్యుడు. ఈ రెండు గ్రహాల కలయిక వ్యక్తుల జాతకచక్రంపై బలమైన ప్రభావం చూపుతుంది. ఏ వ్యక్తుల జాతకంలోనైతే ఇవి బలమైన స్థానంలో ఉంటాయో ఆ వ్యక్తులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...
రెండింటి కలయిక.. బోగభాగ్యాలు :
రాహువు, శుక్రుడి స్వభావం అనేక అంశాల్లో సరిపోలుతుంది. ఆనందాన్ని ఆస్వాదించడం ఇద్దరి ప్రాధాన్యత. రెండింటి స్వభావంలో బోగ లాలస ఉంది. అంటే.. తినడం, తాగడం, బహు ఆనందంతో గడపడం ఉంటుంది. ఈ రెండు గ్రహాలు ఎలా బోగభాగ్యాలను ఇష్టపడతాయో.. ఈ గ్రహాల సంచారం జాతకంలో బలంగా ఉన్న వ్యక్తులు కూడా అంతే భౌతిక సుఖాలను ఇష్టపడుతారు. రాహువు, శుక్రుడి కలయిక అపార సంపదను అందిస్తుంది.
రెండు గ్రహాల యోగం.. ప్రతికూల ఫలితాలు
రెండు గ్రహాల కలయిక వల్ల.. వీటి సంచారం బలంగా ఉండే వ్యక్తుల వైవాహిక జీవితంపై చెడు ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఈ కారణంగా వైవాహిక జీవితం దెబ్బతినవచ్చు. కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా ప్రేమ వివాహం జరగొచ్చు. అయితే ఇది మంచిది కాదు. రాహువును విషానికి అధిపతిగా పరిగణిస్తారు. ఈ కారణం వల్ల వ్యక్తుల జాతకంలో రాహువు సంచారం భార్య ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. భార్యకు యూరిన్ ఇన్ఫెక్షన్, మధుమేహం వంటి వ్యాధులు తలెత్తవచ్చు. పురుషుల్లోనూ ఇదే తరహా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
ఈ చిట్కా పాటిస్తే... :
రాహు, శుక్రుల యోగాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే జ్యోతిష్య శాస్త్రంలో అందుకు కొన్ని చిట్కాలు ఉంటాయి. ఇందులో ముఖ్యమైనది అమ్మవారిని పూజించడం. దుర్గా మాతను పూజించడం వల్ల ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా కలిగే అన్ని సానుకూల ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా డబ్బుకు ఎటువంటి కొదువ ఉండదు.
Also Read: SSC Exams: తాగుబోతు ఇన్విజిలేటర్... పీకలదాకా తాగి ఎగ్జామ్ హాల్‌కు.. సస్పెండ్ చేసిన విద్యాధికారి
Also Read: Video: ఈ చిన్నారి సంకల్పానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఒంటికాలితో గెంతుతూ స్కూల్‌కు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి