Shanidev Remedies: శనిదేవుడిని న్యాయదేవత అంటారు. ఎందుకంటే మనం చేసే పనులను బట్టి ఫలాలను ఇస్తాడు కాబట్టి. శనివారం శనిదేవుడిని (Shanidev) పూజిస్తారు. ఈ రోజున శనిదేవుడిని ఆరాధించడం, మంత్రాల పఠించడం ద్వారా శని అనుగ్రహం పొందవచ్చు. ఎవరిపై నైనా శని వక్ర దృష్టి పడిందంటే అతడి జీవితం సర్వ నాశనమవుతుంది. అతడు తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టామిట్టాడుతాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం శని గ్రహం కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. మరో మూడు రోజుల్లో తన రాశిని మార్చబోతున్నాడు. జూలై 12న  కుంభరాశిని వదిలి మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. ప్రస్తుతం తిరోగమన శని సంచారం వల్ల మకర, మీన, కుంభరాశుల వారు సడేసతితో ఇబ్బందులు పడుతున్నారు. కర్కాటక, వృశ్చిక రాశి శనిధైయాతో సతమతమవుతున్నారు. ఈ పరిహారాలు చేయడం ద్వారా శనిదేవుని అనుగ్రహం పొంది శని సడేసతి మరియు ధైయాను విముక్తి పొందుతారు. 


ఇలా చేయండి
>> శనివారం నాడు శని దేవాలయానికి వెళ్లి భక్తిశ్రద్ధలతో ఆ దేవుడిని పూజించండి. అతనికి ఆవాల నూనె, నల్ల నువ్వులు, నీలం పువ్వులు, ఉరద్ సమర్పించండి. దీనితో పాటు నల్ల వస్త్రాలు, అరటిపండ్లు, ఆహారం, నువ్వులు, ఉసిరి, మిఠాయిలు మొదలైన వాటిని పూజానంతరం నిరుపేదలకు దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది.
>>శనివారం నాడు కనీసం 108 సార్లు 'ఓం శనిశ్చరాయై నమః' అని జపించండి. అంతేకాకుండా శని చాలీసా కూడా పఠించండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడై మీరు కోరిన కోరికలు తీరుస్తాడు. 
>> శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేసేవారిని శనిదేవుడు ఇబ్బంది పెట్టడు. కాబట్టి, ఈ రోజున హనుమాన్ చాలీసాను పూర్తి భక్తితో పఠించండి. 


Also Read: Devshayani Ekadashi 2022: దేవశయని ఏకాదశి వ్రతాన్ని చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.