Devshayani Ekadashi 2022: దేవశయని ఏకాదశి వ్రతాన్ని చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

Devshayani Ekadashi 2022:  దేవశయని ఏకాదశి వ్రతం చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతోపాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ఏడాది దేవశయని ఏకాదశి జూలై 10న వస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2022, 12:56 PM IST
  • జూలై10న దేవశయని ఏకాదశి
  • ఆనందంగా ఉండాలంటే ఈ వ్రతాన్ని పాటించండి
Devshayani Ekadashi 2022: దేవశయని ఏకాదశి వ్రతాన్ని చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

Devshayani Ekadashi 2022: రేపే (10 జూలై 2022) దేవశయని ఏకాదశి. ఈ ఏకాదశినే పద్మనాభ ఏకాదశి లేదా హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచే శ్రీహరి యోగ నిద్రలోకి వెళతాడు. ఈసారి దేవశయని ఏకాదశి (Devshayani Ekadashi 2022) నాడు శుభ యోగం, రవియోగం, శుక్ల యోగం, బుధాదిత్య యోగం, హంస యోగం వంటి ఎన్నో అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా ఈ రోజు నుంచే చాతుర్మాసం ప్రారంభమవుతుంది. పూర్వం మాంధాత అనే రాజు తమ రాజ్యంలో ఉన్న కరవును పోగొట్టడానికి ఈ వ్రతాన్ని చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరిస్తే.. మీ పాపాల నుంచి విముక్తి పొందుతారు.

దేవశయని ఏకాదశి వ్రత ప్రయోజనాలు
1. దేవశయని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణువును పూజించడం వల్ల మీ మానసిక రుగ్మతలు తొలగిపోతాయి.
2. ఎవరైతే ఈ ఏకాదశికి ఉపవాసం ఉండి పూజలు చేస్తారో..వారికి ఆరోగ్యం బాగా ఉండటమే కాకుండా.. శారీరక బాధలు కూడా దూరమవుతాయి. 
3. దేవశయని ఏకాదశి వ్రతం చేయడం వల్ల మీ లైఫ్ లో ఆనందం వెల్లివిరిస్తుంది.  
4. ఈ వ్రతాన్ని ఆచరిస్తే.. వ్యక్తి మరణానంతరం కూడా మోక్షాన్ని పొందుతాడు.
5. దేవశయని ఏకాదశి వ్రత కథ వింటే మీరు పాపాల నుంచి విముక్తి పొందవచ్చు.  
6. మీ ఇల్లు డబ్బుతో నిండిపోవాలంటే... దేవశయని ఏకాదశి వ్రతం రోజున విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని పూజించాలి.

Also Read: Saturday remedies: శనివారం రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేయండి, ఇక చూడండి మీ ఇంట డబ్బే డబ్బు..! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News