Favourite God: మీ ఇష్టదైవం ఎవరో ఎలా తెలుసుకోవచ్చు, ఇష్టదైవమంటే ఏంటి
Favourite God: హిందూధర్మంలో ప్రతి ఒక్కరికీ ఇష్టదైవాలుంటారు. ఇష్టదైవాన్ని పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయనేది ఓ విశ్వాసం. మరి మీ ఇష్టదైవం ఎవరో ఎలా ఎలుసుకోవాలి, ఎలా పూజలు చేయాలో తెలుసుకుందాం..
Favourite God: హిందూధర్మంలో ప్రతి ఒక్కరికీ ఇష్టదైవాలుంటారు. ఇష్టదైవాన్ని పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయనేది ఓ విశ్వాసం. మరి మీ ఇష్టదైవం ఎవరో ఎలా ఎలుసుకోవాలి, ఎలా పూజలు చేయాలో తెలుసుకుందాం..
హిందూమతం ప్రకారం దేవదేవుళ్లు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరూ ఒక్కో దైవాన్ని అత్యంత ఇష్టంగా పూజిస్తారు. ఇష్టదైవాన్ని పూజిస్తే అనుకున్న కోర్కెలన్నీ నెరవేరుతాయని భావిస్తారు. మరి ఈ క్రమంలో ఎవరి ఇష్టదైవం ఎవరనేది ఎలా తెలుసుకోవడం..ఇదే అసలు ప్రశ్న. దేవుడిని మామూలుగా పూజిస్తే కోర్కెలు నెరవేరవా అనే ప్రశ్న వస్తోంది. మీ సమస్యల్ని ఇష్టదైవాన్నే ఎందుకు కోరాలి, ఇష్టదైవం ఎలా తెలుస్తుందనేది తెలుసుకుందాం...
ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది తమ సమస్యలు నివేదించేందుకు సాధారణంగా తమపై ఉన్న అధికారికే విజ్ఞప్తి చేస్తారు. నేరుగా అందరికంటే టాప్ బాస్ దగ్గరకు వెళ్లరు. ఎందుకంటే ఓ నిర్ణీత పద్ధతి ద్వారా సమస్యలు పై అధికారికి నివేదించాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్ని చిన్న చిన్న సమస్యలకైతే చిన్న బాస్ ద్వారానే పరిష్కారమైపోతాయి. చిన్న చిన్న సమస్యలకు సంబంధిత విభాగాల అధిపతుల్ని సంప్రదించినట్టే..హిందూమతంలో కూడా కొన్ని సమస్యలు ఇష్టదైవానికే సమర్పించుకోవాలంటున్నారు జ్యోతిష్యులు.
ఇదే విధంగా హిందూమతంలో కూడా చాలావరకు సమస్యలకు ఇష్టదైవాన్ని పూజిస్తే చాలంటున్నారు. ఏదైనా సమస్య పరిష్కారం కాకుండా పెండింగులో ఉంటే తప్పకుండా ఇష్టదైవాన్ని ప్రార్ధిస్తే పరిష్కారమౌతుంది. భారతీయ సంస్కృతిలో జ్ఞానం, కర్మ, భక్తి కలిసున్నాయి. దేనికదే మహత్యముంది. ఒక్కొక్కరూ ఒక్కో అంశం ఆధారంగా ముక్తి సంపాదించుకుంటారు.
ఇష్టదైవాన్ని ఎలా తెలుసుకోవడం
భక్తి, ఆధ్యాత్మికతలో ఉండేవారికి ఇష్టదైవం ఎవరనే ప్రశ్న వస్తుంటుంది. ఏ దేవతను పూజించాలనే ఆలోచన చేస్తుంటారు. కొందరికి శివుడు ప్రీతిపాత్రుడైతే, మరి కొందరికి విష్ణువు ఇష్టదైవంగా ఉంటాడు. ఇంకొందరికి కృష్ణుడైతే...కొంతమంందికి హనుమంతుడు. ఇష్టదైవంపై దృష్టి సారించి ప్రార్ధనలు చేస్తే దేవతలు ప్రసన్నమౌతారని అంటారు. ఇష్ట దైవం లేదా దేవత నిర్ణయం పుట్టుకను బట్టి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో జన్మకుండలి పంచమభావం నుంచి పూర్వ జన్మకు సంబంధించి ధర్మం, కర్మ, జ్ఞానం, బుద్ధి, చదువు, భక్తి, కూడా ఉంటాయి. దీని ఆధారంగా ఇష్టదైవం నిర్ధారిస్తారు. ఇంకోవైపు రాశి, లగ్నాన్ని బట్టి కూడా ఇష్ట దైవాన్ని నిర్ణయిస్తారు.
Also read: Jupiter Retrograde: జూలై 29 నుంచి ఆ 4 రాశుల జాతకం పూర్తిగా మారిపోవడం ఖాయం, డబ్బేడబ్బు..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook