Famous Ram temples: మరి కొద్దిగంటల్లో అయోధ్య నూతన రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమముంది. జనవరి 22 అంటే రేపు మద్యాహ్నం జరగనున్న ప్రారంభోత్సవానికి దేశ విదేశాల్నించి అతిధులు తరలిరానున్నారు. ఈ సందర్భంగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రసిద్ధికెక్కిన రామమందిరాలు ఏమున్నాయనే చర్చ సాగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనవరి 22 మద్యాహ్నం 12.20 గంటలకు భవ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. అయోధ్య నగరితో సహా అన్ని ప్రాంతాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. అయోధ్య రామాలయం పూలతో అలంకరించుకుని విద్యుత్ లైట్ల వెలుగులతో దేదీప్యమానంగా కొత్త శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా దేశంలోని ఇతర రామాలయాల్లో కూడా వేడుక జరపనున్నారు. అయోధ్యతో పాటు దేశంలోని సుప్రసిద్ధ ఇతర రామాలయాల గురించి తెలుసుకుందాం..


తెలంగాణలో


తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉన్న సీతా రామచంద్ర స్వామి ఆలయం చాలా ప్రసిద్దికెక్కింది. ప్రతియేటా రామనవమి అత్యంత ఘనంగా జరుగుతుంటుంది. దేశం నలుమూలల్నించి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. 


నాసిక్ రామమందిరం


నాసిక్ పంచవటిలో ఉన్న రామమందిరం 2 అడుగుల ఎత్తులోని నల్లని రాముడి విగ్రహానికి ప్రసిద్ధి. ఈ విగ్రహం పేరుతోనే ఆలయాన్ని పిలుస్తారు. 


కేరళలో...


కేరళలోని త్రిశూర్ జిల్లా త్రియాలో ఉన్న రామమందిరం దక్షిణాదిలోనే అత్యంత ప్రసిద్ధికెక్కింది. చాలా ప్రాచీన ఆలయమిది. 


మద్యప్రదేశ్‌లో


మద్యప్రదేశ్‌లోని ఓర్ఛాలో ఉన్న రామమందిరం చాలా ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయంలో శ్రీరాముడిని దేవుడి రూపంలో కాకుండా రాజు రూపంలో కొలుస్తుంటారు. ఇతర రామాలయాలతో కాస్త విభిన్నమైంది కావడంతో ఇది ప్రసిద్ధికెక్కింది. 


తమిళనాడులో


తమిళనాడులో రామ స్వామి మందిరం అయోధ్య రామమందిరంలా ప్రస్దిద్ధి చెందింది. ఈ ఆలయంలో రామునితో పాటు అతని సోదరులు, సీతా దేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. 


Also read: Maha Yoga effect: సంక్రాంతి తర్వాత ఈ 5 రాశులకు పట్టిన కుబేర యోగం.. మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook