Bathukamma Festival: అక్టోబర్ 2న భాద్రపద అమావాస్య రోజున ఎంగిల పూల బతుకమ్మతో ప్రారంభయ్యే బతుకమ్మ ఉత్సవాలు.. తొమ్మిది రోజులు పాటు అంగరంగ వైభవంగా కొనసాగి.. అక్టోబర్ 10 దుర్గాష్టమి రోజున ముగుస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబర్ 2  భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మతో ఈ పండగ ప్రారంభం అవుతుంది.


అక్టోబర్ 3  ఆశ్వయుజ శుక్ల పాడ్యమి- గురు వారం రోజున అటుకుల బతుకమ్మ ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నవరాత్రలు ప్రారంభం రోజున కలశ స్థాపన చేసి ఆవాహాన చేసిన పూజా చేస్తారు.


అక్టోబర్ 4వ తేది ఆశ్వయుజ శుక్ల విదియ శుక్రవారం రోజున ముద్దపప్పు బతుకమ్మను ఆడతారు.


అక్టోబర్ 5వ తేది ఆశ్వయుజ శుక్ల తదియ శని వారం రోజున  నానే బియ్యం బతుకమ్మ పేరుతో అమ్మవారిని పూజిస్తారు.


అక్టోబర్ 6  ఆశ్వయుజ శుక్ల చవితి ఆదివారం రోజున అట్ల బతుకమ్మ పేరుతో నిర్వహిస్తారు.


అక్టోబర్ 7  ఆశ్వయుజ శుక్ల పంచమి సోమవారం అలిగిన బతుకమ్మ పేరుతో అమ్మవారికి వైవేద్యం సమర్పించడం ఆచారంగా వస్తుంది.


అక్టోబరు 8 ఆశ్వయుజ శుక్ల షష్టి  మంగళవారం రోజున వేపకాయల బతుకమ్మ పేరుతో అమ్మవారిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తుంది.
ఏడో రోజు వేపకాయల బతుకమ్మ


అక్టోబరు 9 ఆశ్వయుజ శుక్ల సప్తమి బుధవారం  రోజున వెన్నముద్దల బతుకమ్మ పేరుతో అమ్మవారిని కొలుస్తారు.


అక్టోబరు 10  ఆశ్వయుజ శుక్ల అష్టమి ( దుర్గాష్టమి) గురువారం రోజున -సద్దుల బతుకమ్మతో అమ్మవారిని ఆరాధిస్తారు.


బతుకమ్మ పండుగలో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. ఈ రోజు బతుకమ్మలను పెద్ద పరిమాణంలో తయారు చేస్తారు. ఈ రోజు చివరి రోజు కావడంతో సంబరాలు అంబరాన్నంటేలా నిర్వహిస్తారు. భారీ బతుకమ్మలు తయారు చేసి ఆడిపాడిన తర్వాత..తీసుకెళ్లి నదిలో నిమజ్జనం చేస్తారు. ఈ వేడుక దుర్గాష్టమి రోజున జరుపుకుంటారు.


బతుకమ్మ పండగ తెలంగాణలో ఎప్పుడు ఎలా ప్రారంభమైందో చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు.  కానీ వేల ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది.  జగజ్జనని మహిషాసురుడి సంహారించిన  తర్వాత అలసటతో మూర్ఛపోయిందట. ఆ జగన్మాతను  మేల్కొలిపేందుకు స్త్రీలంతా గుమిగూడి ప్రార్థించారట. బతుకమ్మా అంటూ పాటలు పాడారట. సరిగ్గా పదో రోజు ఆమె నిద్రలేచిందని అప్పటి నుంచి బతుకమ్మ వేడుక జరుపుకుంటున్నాని ఓ కథనం ప్రచారంలో ఉందది.  ఈ వేడుకలో అలిగిన బతుకమ్మ రోజు మినహా మిగిలిన రోజుల్లో అమ్మవారికి రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తూ అమ్మవారిని పూజిస్తారు.


ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!


ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.