Karwa Chauth 2022 Gift Ideas: హిందూమతంలో వివాహిత మహిళలకు అత్యంత ప్రాముఖ్యమైన పండుగ కర్వా చౌత్. అక్టోబర్ 13 గురువారం కర్వా చౌత్ దేశవ్యాప్తంగా ఘనంగా జరగనుంది. ఈ క్రమంలో మీ ప్రియమైన భార్యకు ఎలాంటి బహుమతి ఇవ్వాలో నిర్ణయించుకున్నారా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్వాచౌత్. భర్త దీర్ఘాయుష్షు కోరుతూ వివాహిత మహిళలు చేసే వ్రతం. అక్టోబర్ 13వ తేదీ గురువారం నాడు దేశవ్యాప్తంగా జరగనుంది. హిందూమతంలో కర్వాచౌత్‌కు అత్యంత ప్రాధాన్యత, మహత్యమున్నాయి. మీ కోసం కర్వా చౌత్ ఆచరిస్తున్న మీ భార్యకు ఏ బహుమతి ఇస్తున్నారు మరి..


కర్వా చౌత్ రోజున భార్య తన భర్త దీర్ఘాయుష్షు కోరుకుంటూ వ్రతం ఆచరిస్తుంది. ఈ వ్రతాన్ని నిర్జల వ్రతమంటారు. వ్రతం సందర్భంగా కనీసం నీళ్లు కూడా తాగకుండా ఉంటారు. మీ కోసం అంతలా వ్రతం ఆచరిస్తున్న మీ భార్యకు మంచి బహుమతి ఇవ్వడం కూడా ఓ ఆనవాయితీ. దక్షిణాది కంటే ఉత్తరాదిన ఈ పండుగ ఘనంగా నిర్వహిస్తారు. మీ భార్యకు బహుమతి ఇచ్చేందుకు కొన్ని ఐడియాలు మీకు అందిస్తున్నాం. నచ్చితే వెంటనే మీ భార్య మెప్పు పొందేందుకు మంచి బహుమతి కొనివ్వండి మరి..


కర్వా చౌత్ బహుమతులు


1. మీ భార్యకు పుస్తకాలు చదవడం ఇష్టమైతే కర్వా చౌత్ నాడు బుక్ షెల్ఫ్ ఇస్తే బాగుంటుంది. ఆ బుక్ షెల్ఫ్ కూడా ఎంపిక చేసిన పుస్తకాలతో ఉంటే మరీ మంచిది.


2. మీ భార్యకు కుకింగ్‌పై ఆసక్తి ఉంటే..వంటగదికి సంబంధించిన వస్తువులు మైక్రోఓవెన్, గ్లాస్ టాప్ మోడర్న్ స్టౌవ్ వంటివి ఇస్తే ఆకర్షణీయంగా ఉంటుంది. 


3. ఒకవేళ మీ భార్యకు మేకప్ అంటే ఇష్టమైతే..ఆమెకిష్టమైన బ్రాండెడ్ మేకప్ కిట్ బహుమతిగా ఇవ్వండి


4. ఒకవేళ మీ భార్యకు ఫోటోలు తీయడం ఇష్టమైతే..ఆమెకు సంబంధించిన సెల్ఫీలు సేకరించి ఆల్బమ్‌గా చేసి ప్రజెంట్ చేయవచ్చు.


5. ఒకవేళ మీ భార్యకు సినిమాలు చూడటం ఇష్టమైతే..ఇంట్లోనే సినిమా చూపించవచ్చు. దీనికోసం ఇంట్లో హోమ్ థియేటర్ బహుమతిగా ఇస్తే బాగుంటుంది. 


Also read: Gajakesari Yoga: మీనరాశిలో గజకేసరి యోగం.. ఈ 3 రాశుల వారు పట్టిందల్లా బంగారమే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook