Bhadra Raja Yoga 2024: సెప్టెంబర్ నెలలో భద్ర రాజయోగం ఏర్పాటు.. ఈ రాశులవారికి ముట్టింది బంగారమే..
Bhadra Raja Yoga 2024: బుధ గ్రహం ఒకే నెలలోని రెండు రాశుల్లోకి సంచారం చేయడం వల్ల `భద్ర రాజయోగం` ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Bhadra Raja Yoga 2024: బుధ గ్రహం ఎప్పుడు సంచారం చేసిన ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. ఎందకంటే అన్ని గ్రహాల్లోకెళ్లా ఈ గ్రహాన్ని శుభగ్రహంగా పరిగణిస్తారు. అయితే ఈ బుధ గ్రహం తిరోగమనంలో ఉంది. ఈ తిరోగమనంలో వచ్చే మార్పుల కారణంగా కూడా అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఈ గ్రహం తిరోగమనం వచ్చే మార్పుల కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటే.. మరికొన్ని రాశులవారికి అనేక సమస్యలు తెచ్చిపెడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఈ బుధ గ్రహం సెప్టెంబర్ నెలలోని రెండు సార్లు సంచారంలో మార్పులు రాబోతున్నాయి. మొదటగా ఈ గ్రహం సింహరాశిలోకి సంచారం చేయబోతోంది. ఆ తర్వాత నెమ్మదిగా కన్యా రాశిలోకి ప్రవేశిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ బుధుడు రెండు రాశుల్లోకి సంచారం చేయడం వల్ల 'భద్ర రాజయోగం' ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా వెంటనే జరిగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
కన్య రాశి:
కన్యా రాశివారికి ఈ 'భద్ర రాజయోగం' కారణంగా కెరీర్ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా రాజకీయాలు చేస్తున్నవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే సింగిల్స్‌కి ఈ సమయం ఎంతో బాగుంటుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి.
సింహ రాశి:
సింహ రాశివారిపై కూడా ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరికి ఆదాయంలో అనేక మార్పులు వస్తాయి. అంతేకాకుండా పనుల్లో ఒత్తిడి తగ్గి ప్రశాంతత కూడా పెరుగుతుంది. అలాగు వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా జీవితం కూడా చాలా ప్రశాంతంగా సాగుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అనుకున్న లాభాలు కూడా పొందుతారు. తీసుకున్న అప్పులు కూడా తిరిగి చెల్లిస్తారు.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశివారికి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడుతాయి. అంతేకాకుండా తల్లిదండ్రుల మధ్య సంబంధాలు కూడా మెరుపడి అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా బంగారు వ్యాపారాలు చేస్తున్నవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ లభించి అనుకున్న బాధ్యతలు కూడా పొందుతారు. అంతేకాకుండా ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. అలాగే వీరు కొత్త కార్లు లేదా ఇండ్లు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.