Mercury Transit in Capricorn 2023: జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా భావిస్తారు. అంతేకాకుండా ఇతడిని ప్రసంగం, తర్కం, సంభాషణ, వ్యాపారం మరియు సంపదకు కారకుడిగా భావిస్తారు. ఫిబ్రవరి 07న మెర్క్యూరీ మకరరాశిలోకి వెళ్లనున్నాడు. తన రాశిని మార్చడం ద్వారా బుధుడు శనిదేవుడి రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే సూర్యభగవానుడు మకరరాశిలో ఉన్నాడు. మకరరాశిలో సూర్యుడు, బుధుడు కలయిక వల్ల అరుదైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులవారు ఆర్థికంగా లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధాదిత్య యోగం ఈ రాశులకు శుభప్రదం
మేషం: మేషరాశి వారికి బుధ సంచారం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. వీరి కెరీర్ మునుపటి కంటే అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగుల కల ఫలిస్తుంది, వీరికి కొత్త జాబ్ వస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. 
మిథునరాశి : బుధుడు రాశి మార్పు కూడా మిథున రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. ఈ వ్యక్తులు భారీగా డబ్బు పొందుతారు. మీరు ఊహించని ధనం పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. 
సింహ రాశి: సింహ రాశి వారికి బుధ సంచారం చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీరు శ్రమకు పూర్తి ఫలితాలు పొందుతారు. ఉద్యోగాలు చేసే వారు గొప్ప విజయం సాధిస్తారు. మీరు రుణ విముక్తి పొందుతారు. అంతేకాకుండా మీ ప్రత్యర్థులు ఓడిపోతారు.  


తుల: బుధ సంచారం వల్ల తుల రాశి వారికి ఆస్తి సంబంధ ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 
మీనం: బుధ సంచారం వల్ల ఏర్పడిన బుధాదిత్య యోగం మీనరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగంలో లాభం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.


Also Read: Guru Mahadasha 2023: మీ జాతకంలో గురు మహాదశ ఉందా.. అయితే మీరు త్వరలో ధనవంతులవ్వడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook