Guru Mahadasha 2023: మీ జాతకంలో గురు మహాదశ ఉందా.. మీరు త్వరలో ధనవంతులవ్వడం పక్కా..

Guru Mahadasha Upay: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. బృహస్పతి మహాదశ కొంతమందికి అదృష్టాన్ని ఇస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2023, 10:01 AM IST
Guru Mahadasha 2023: మీ జాతకంలో గురు మహాదశ ఉందా.. మీరు త్వరలో ధనవంతులవ్వడం పక్కా..

Guru Mahadasha 2023: ప్రతి ఒక్కరూ తమ జీవితం ఏ కష్టాలు లేకుండాబిందాస్ గా గడపాలని కోరుకుంటారు. మీ లైఫ్ సూపర్ హిట్ అవుతుందో లేదా అట్టర్ ఫ్లాప్ అవుతుందో మీ జాతకంలోని గ్రహాలు నిర్ణయిస్తాయి. మీ కుండలిలో గ్రహాల స్థానం ఆధారంగా కొందరు పెద్దగా కష్టపడకపోయిన లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు, మరికొందరు ఎంతకష్టపడిన చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. అందుకే చాలా మంది జాతకంలోని గ్రహాలు బలపడాలని పూజలు చేస్తారు. అంతేకాకుండా వస్తువులను దానం కూడా చేస్తారు.

పురాణాల ప్రకారం, బృహస్పతిని దేవగురు అంటారు.  ఇతడు బ్రహ్మ మానస పుత్రుడైన మహర్షి అంగీరసుడు కుమారుడు. ఆస్ట్రాలజీలో బృహస్పతిని శుభగ్రహంగా పరిగణిస్తారు.  విద్య, గురువు, మతం, అన్న, దాన ధర్మం, పిల్లలు మొదలైన వాటికి కారకునిగా ఇతడిని భావిస్తారు. ప్రతి గురువారం బృహస్పతిని పూజిస్తారు. మీ జాతకంలో గురుడు శుభస్థానంలో ఉంటే వారికి దేనికీ లోటు ఉండదు. గురుమహాదశ అంటే ఏమిటి, దీని ప్రభావం మీ జీవితంపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 

జాతకంలో బృహస్పతి శుభ స్థానంలో ఉంటే..
గురు మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. జాతకంలో బృహస్పతి శుభ స్థానంలో ఉంటే వారు అనేక ప్రయోజనాలు పొందుతారు. వీరికి డబ్బు కొరత ఉండదు. చదువులో రాణిస్తారు. గురు మహాదశ ప్రారంభమైనప్పుడు మీరు పురోభివృద్ధి సాధించడంతోపాటు సమాజంలో హోదా పెరుగుతుంది. దంపతులకు సంతానప్రాప్తి సిద్దిస్తుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతోంది. 
జాతకంలో బృహస్పతి అశుభ స్థానంలో ఉంటే..
జాతకంలో బృహస్పతి అననుకూల స్థితిలో ఉంటే.. ఆ వ్యక్తి పనిలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దేవుడి మీద పెద్దగా నమ్మకం ఉండదు. ఇతడిలో నాస్తికత్వం పెరుగుతుంది. అనారోగ్యసమస్యలు చుట్టిముడతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి. 
బృహస్పతిని బలోపేతం చేయాలంటే.. 
గురువారం ఉపవాసం ఉండి.. బృహస్పతిని పూజించండి. నీలమణిని ధరించండి. నీటిలో పసుపు వేసి స్నానం చేయండి. అరటి చెట్టును పూజించండి. గురు గ్రహం యెుక్క మంత్రాని పఠించండి.

బృహస్పతి వేద మంత్రం
బృహస్పతే అతి యదర్యో ఆరహద్ ద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు ।
యద్దిదయాచ్ఛవాస్ ఋత్ప్రజాత్ తద్స్మాసు ద్రవిణం ధేహి చిత్రమ్ ।
గురు తాంత్రిక మంత్రం- ఓం బృః బృహస్పతయే నమః
బృహస్పతి బీజ మంత్రం- ఓం గ్రాన్ గ్రీన్ గ్రాన్ సః గురవే నమః.

Also Read: Guru Gochar 2023: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో సూర్యుడు, బృహస్పతి కలయిక.. ఈరాశులకు ప్రతి పనిలోనూ విజయమే ఇక.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News