Budh Ast 2023: బుధుడి అస్తమించడంతో..ఆ 7 రాశులకు తిరగనున్న దశ, అంతా డబ్బే
Budh Ast 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం లేదా అస్తమయం, ఉదయించడం జరుగుతుంటుంది. దీని ప్రభావం వివిధ రాశులపై వివిధ రకాలుగా ఉంటుంది. బుధ గ్రహం అస్తమయం ప్రభావం గురించి తెలుసుకుందాం..
హిందూమతం జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడు కుంభరాశిలో అస్తమించాడు. మార్చ్ 31వ తేదీ మద్యాహ్నం 2.44 గంటలకు ఉదయించనున్నాడు. గ్రహం అస్తమించినప్పుడు పాజిటివ్ ప్రభావం తగ్గుతుంది. కుంభరాశిలో బుధుడితో పాటు శని గ్రహం కూడా ఉండటం వల్ల ప్రభావం గట్టిగా ఉంటుందంటారు జ్యోతిష్యులు.
బుధుడు కుంభరాశిలో అస్తమయం అయిపోయింది. తిరిగి మార్చ్ 31వతేదీన ఉదయించనున్నాడు. అదే సమయంలో అక్కడ శని గ్రహం ఉండటంతో రెండింటి ప్రభావం వల్ల కుంభం, వృషభం, మిధునం, సింహం, కన్యా, తులా,మకర రాశులపై ఊహించని శుభ పరిణామాలు కలుగుతాయి. కుంభరాశిలో బుధుడి అస్తమయం వల్ల ఏ రాశులకు మంచి రోజులు ప్రారంభం కానున్నాయనే వివరాలు పరిశీలిద్దాం. ఎవరి జాతకం ఎలా ఉండనుందో తెలుసుకుందాం.
కుంభరాశి వారికి బుధుడి అస్తమించడం ప్రభావం కొత్త అవకాశాల్ని తెచ్చిపెడుతుంది. కుటుంబ వ్యవహారాల్లో అటూ ఇటూ తేడా ఉండవచ్చు. కానీ కొన్ని రోజుల్లో అంతా సర్దుకుంటుంది. ఇటీవల ఉద్యోగం మారినవారికి లాభాలు కలుగుతాయి. అధికారుల సహకారం, ప్రోత్సాహం లభిస్తుంది.
మిధున రాశి వారికి బుధుడి అస్తమయం ప్రభావంతో వ్యాపారంలో భారీ లాభాలు కలుగుతాయి. విదేశాలకు చెందిన వ్యాపారమైతే అత్యంత అనువైన సమయం. ఉద్యోగులకు విజయం లభిస్తుంది. ఆర్దిక లాభాలు కలుగుతాయి.
సింహ రాశి జాతకులకు అంతా శుభం కలగనుంది. కుటుంబంలో ఇబ్బందులు ఎదురైనా తరువాత సమసిపోతాయి. మీరు చేసే పని వేగవంతమౌతుంది. లాభం కలుగుతుంది. వ్యాపారులకు ఊహించని లాభాలు ఎదురౌతాయి.
వృషభ రాశి వారికి బుధుడి అస్తమయం ప్రభావంతో జీవితం మారిపోనుంది. పనిచేసేచోట ప్రశంసలు లభిస్తాయి. మీ బాస్ మీ పనితీరుని ప్రత్యేకంగా గుర్తిస్తారు. మరో మంచి ఉద్యోగ ప్రతిపాదన వస్తుంది. వ్యాపారులకు కాస్త కష్టకాలమని చెప్పాలి. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలి.
తుల రాశి వారికి బుధుడి అస్తమయం ప్రభావంతో కష్టాలు, ఇబ్బందులు తగ్గుతాయి. ఈ సమయం మీకు అన్నింట్లో విజయాలన్ని ఇస్తుంది. పెండింగులో పడి నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. కెరీర్ సంబంధిత విషయాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. మంచి జీతం, ఉన్నత పదవులు రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. పదోన్నతి లాభిస్తుంది.
కన్యా రాశి జాతకులకు బుధుడి అస్తమించడం వల్ల చట్టపరమైన విషయాల్లో సాఫల్యం లభిస్తుంది. ఇబ్బందులు తగ్గవచ్చు. పనిచేసే చోట కొన్ని సమస్యలు ఎదురైనా త్వరలోనే దూరమౌతాయి. నిలిచిపోయి రాదనుకున్న డబ్బు తిరిగి చేతికి అందుతుంది. ఆఫీసు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
మకర రాశి వారికి బుధ అస్తమయం ప్రభావంతో ఆర్ధిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. కుటుంబంతో బయటి ప్రాంతాలు తిరుగుతారు. సంబంధాలు మధురమౌతాయి. అత్తారింటివారితో సంబంధాలు మెరుగుపడతాయి. స్నేహితుల సహాయంతో మంచి అవకాశాలు లభిస్తాయి.
Also read: Mercury transit 2023: బుధు గోచారంతో ఆ 5 రాశులకు మార్చ్ 31 నుంచి ఊహించని డబ్బు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook