Budh Asta in Meena Rashi 2024: ప్రతి నెలా ఏవో కొన్ని గ్రహాలు తమ కదలికలను మార్చుకుంటూ ఉంటాయి. ఈ జాబితాలో గ్రహాల ప్రిన్స్ బుధుడు కూడా ఉన్నాడు. ఈ నెలలో మెర్క్యూరీ గమనంలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఏప్రిల్ 02 నుండి తిరోగమనంలోకి వెళ్లిన బుధుడు.. ఈరోజు(ఏప్రిల్ 04) మేషరాశిలో అస్తమించబోతున్నాడు. మరో 5 రోజుల తర్వాత ఏప్రిల్ 9న బుధుడు మీనరాశిలోకి వెళ్లబోతున్నాడు. వారం రోజుల వ్యవధిలోనే బుధుడు మూడు సార్లు రాశిని మార్చడం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు.  ఆ అదృష్ట రాశిచక్రాలు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీన రాశి: త్వరలో ఇదే రాశిలోకి బుధుడు వెళ్లబోతున్నాడు. దీంతో మీరు కెరీర్ లో మంచి స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఏ కార్యం తలపెడితే అందులో విజయం సాధిస్తారు. ప్రేమికుల మధ్య గొడవలు తొలగిపోతాయి. భార్యభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఎంతో కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. 


మిథునం: ఈ రాశికి బుధుడిని అధిపతిగా భావిస్తారు. తాతముత్తాతల ఆస్తులు మీకు సంక్రమిస్తాయి. మీకు నచ్చిన జాబ్ వస్తుంది. అంతేకాకుండా కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ కూడా పొందుతారు. మీకు ప్రతి పనిలో లైఫ్ పార్టనర్ సపోర్టు దొరుకుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. వివాహం కాని యువతీయువకులకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే అవకాశం ఉంది. 


కన్యారాశి: బుధుడు గమనంలోని ఈ మార్పులు కన్యారాశి వారు ఊహించని ఫలితాలను ఇస్తాయి. మీరు ఏప్లిల్ లో కెరీర్ కు సంబంధించిన శుభవార్త వింటారు. మీ ఆదాయం భారీ మెుత్తంలో పెరుగుతుంది. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. మీ బిజినెస్ విస్తరిస్తుంది. మీ పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి. 


(Disclaimer:  ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also read: Papamochani Ekadashi 2024: పాపమోచని ఏకాదశి రోజు ఈ చిన్న పనిచేస్తే లక్ష్మీనారాయణుల కటాక్షం..


Also read: Mercury transit 2024: మీన రాశిలో త్రిగ్రాహి యోగం... ఈ 3 రాశులకు లక్కే లక్కు.. లాభాలే లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి