Papamochani Ekadashi 2024 Remedy: ఏకాదశి విష్ణువుకు అంకితం చేసిన రోజు. ఏడాదిలో 24 ఏకాదశి తిథులు వస్తాయి. ఈ నెల ఏప్రిల్ 5న పాపమోచని ఏకాదశి రానుంది. ఈరోజు పరమపవిత్రమైన రోజు. పామమోచని ఏకాదశి రోజు విష్ణు ఆరాధన చేస్తే బ్రహ్మహత్యదోషం కూడా తొలగిపోతుంది. అందుకే ఈ ఏకాదశి అత్యంత విశేషమైనది. ఈరోజు స్నానదానానికి అత్యంత విశేషమైన రోజు. ఈరోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది.
ఏకాదిశి అనగానే విష్ణువును ఆరాధించే విశేషమైన రోజుగా పరిగణిస్తారు. పామపమోచని ఏకాదశి రోజు చేసే పరిహారం మీకు లక్ష్మీనారాయణుల కటాక్షం కలుగుతుంది. అంతేకాదు పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. పాపమోచని ఏకాదశి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నాన దానాలు చేయాల్సి ఉంటుంది. విష్ణు పూజ చేసుకుని ఉపవాసాలు ఉంటారు. అంతేకాదు దగ్గర్లోని ఏదైనా విష్ణు ఆలయంలో పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల మరణానంతరం స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు.
ఇదీ చదవండి: శనిప్రదోష వ్రతం ఎప్పుడు? ఈరోజు ప్రత్యేకతేంటో తెలుసా?
ఏకాదశి రోజు ముఖ్యంగా పెద్దలను గౌరవించాలి. వారితో అనుచితంగా ప్రవర్తించకూడదు. అంతేకాదు ఏకాదశి రోజు అన్నం తినకూడదని అంటారు. ఈరోజు ముర అనే రాక్షసుడు అన్నంలో దాక్కొని ఉంటాడని అన్నం తినరు. అంతేకాదు ఏకాదశి రోజు మద్యం, మాంసం తీసుకోరాదు. ఏకాదశి రాత్రి దీపాలు వెలిగించే ఆచారం కూడా ఉంటుంది.
పామమోచని ఏకాదశిరోజు విష్ణువును పూజించడం వల్ల బ్రహ్మహత్యాదోషం, బంగారం చోరీ వంటి పాపాలు తొలగిపోతాయి. ఈ ఏకాదశిరోజు విష్ణువు పూజ చేసి ఉపవాసం ఉండాలి. అంతేకాదు రాత్రి జాగరణ కూడా చేస్తారు. ఆ సమయంలో విష్ణు మంత్రాలు, కథలు చదువుకోవాలి. మరుసటి రోజు ఉపవాసం విరమించాలి. ఈరోజు రావిచెట్టును పూజిస్తే కూడా సకల దోషాలు తొలగిపోతాయి.
ఇదీ చదవండి: సోమవతి అమావాస్య రోజు ఈ రెమిడీ చేస్తే శత్రువులు సైతం మోకరిల్లాల్సిందే..
ఏకాదశి రోజు మీరు ఏదైనా దగ్గర్లోని విష్ణు ఆలయానికి వెళ్లి 11 గోమతి చక్రాలు, 3 ఏకాక్షి కొబ్బరికాయలను సమర్పించండి. ఆ తర్వాత గోమతి చక్రాన్ని మీతోపాటు ఇంటికి తీసుకెళ్లి పసుపు గుడ్డలో కట్టి ఉంచాలి. దీన్ని మీ ఇంట్లో డబ్బు దాచే ప్రదేశంలో లేదా ఆఫీసులో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం మీపై ఉంటుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి