జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెలలో చాలా మార్పులు సంభవించనున్నాయి. ఈ నెలలో శుక్రుడు, బుధుడు, సూర్య గ్రహాల గోచారముంది. గ్రహాల ఈ కదలిక అన్ని రాశులపై ప్రభావం చూపించనుంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధుడు ఫిబ్రవరి 7 వతేదీన మకర రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో అప్పటికే సూర్యుడు కొలువుదీరి ఉండటంతో..బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. గ్రహాల గోచారం కొన్ని రాశులకు అత్యంత శుభదాయకం కానుంది. అదే సమయంలో కొన్ని రాశుల జాతకులకు చాలా సమస్యగా మారనుంది. బుధ గోచారంతో లాభపడనున్న 5 రాశుల వివరాలు ఇవే..


మేషరాశి


బుధుడు మకర రాశిలో ప్రవేశించగానే సూర్యుడితో కలిసి బుధాదిత్య యోగం ఏర్పరుస్తుంది. ఇది మేషరాశివారికి చాలా ప్రయోజనకరం. ఉద్యోగాలకై అణ్వేషిస్తున్నవారి కోర్కెలు నెరవేరుతాయి. సొంతింటి కల నెరవేరుతుంది. వ్యాపారులకు చాలా అనువైన సమయమౌతుంది. వ్యాపార రంగాలకు చెందినవారికి పదోన్నతి లభిస్తుంది. 


కర్కాటక రాశి


బుధుడి గోచారం కర్కాటక రాశివారికి అంతులేని సంతోషాన్నిస్తుంది. ఈ రాశి జాతకులకు కష్టపడితే భారీ సాఫల్యత ఉంటుంది. ప్రత్యర్ధులు మీ ముందు నిలబడజాలరు. మీకు దాసోహమైపోతారు. ఉద్యోగార్ధులకు మంచి సమయం. ఒకవేళ పాత అప్పులుంటే తీరిపోతాయి. ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే..ఈ సమయం పూర్తిగా అనుకూలం.


సింహ రాశి


సింహ రాశి జాతకులకు అత్తారింటి నుంచి ఆనందాన్నిచ్చే వార్తతో పాటు పెద్ద ఎత్తున ప్రయోజనం కలగనుంది. పనిచేసేచోటు మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెండింగులో ఉన్న పులు పూర్తవుతాయి. కుటుంబంతో కలిసి ఏదైనా యాత్రకు వెళ్లవచ్చు.


తులా రాశి


తులా రాశి జాతకులకు బుధ గోచారం చాలా బాగుంటుంది. త్వరగా స్థిర లేదా చరాస్థి కొనుగోలు చేయవచ్చు. ఇది మీకు చాలా అదృష్టంగా మారనుంది. ఆ తరువాత శుభవార్తలు వింటుంటారు. అంటే ఒకవేళ మీరు 1 రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయలు లాభం కలుగుతుంది. ఆరోగ్యం దృష్ట్యా మంచి అనుకూల సమయం. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 


మీన రాశి


మీన రాశి జాతకులకు మంచి సమయం. ఉద్యోగం చేసేవారికి పదోన్నతులు లభిస్తాయి. మరో చోటికి బదిలీ కావచ్చు. మీ మనస్సులో దాచుకున్న కోర్కెలు పూర్తవుతాయి. విద్యార్ధుల ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఈ సమయంలో ప్రశాంతంగా ఉండి..లాభాలు పొందండి.


Also read: Budhadithya Yoga: కుంభ రాశిలో అరుదైన యోగం.. ఈరాశుల జీవితం అద్భుతం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook