Budh Margi After Shani Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈ గ్రహాల సంచారం, తిరోగమనం మరియు కదలికల ప్రభావం ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. జనవరి 17న శనిదేవుడు కుంభరాశిలో సంచరించిన వెంటనే జనవరి 18న జ్ఞానాన్ని ఇచ్చే బుధుడు ధనుస్సు రాశిలో సంచరించబోతున్నాడు. బుధుడి మార్గి (Mercury Margi 2023) కారణంగా మూడు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధుడి ప్రత్యక్ష సంచారం ఈ రాశులకు శుభప్రదం
సింహరాశి (Leo): ధనుస్సు రాశిలో బుధగ్రహ సంచారం సింహ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశిచక్రం యొక్క ఐదో ఇంట్లో బుధుడి సంచారం జరగనుంది. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థుల కోరిక నెరవేరుతుంది. పిల్లలతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. సంతానం లేని దంపతులకు పిల్లలు కలిగే అవకాశం ఉంది. పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి. 
తులారాశి (Libra): తుల రాశి వారికి బుధ సంచారం శుభప్రదంగా ఉంటుంది. బుధ సంచారం ఈ రాశి యెుక్క మూడో ఇంట్లో జరగనుంది. దీని కారణంగా మీలో ధైర్యం పెరిగే అవకాశం ఉంది. కుటుంబంతో మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. సోదరసోదరీమణుల సహకారం లభిస్తుంది. మీరు ఆస్తి మెుదలైన వాటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి (Sagittarius): ధనుస్సు రాశిలో బుధుని సంచారం ఆర్థిక మరియు వైవాహిక జీవితానికి గొప్పగా ఉంటుంది. జనవరి 17న శని సంచారంతో ధనుస్సు రాశి వారు సాడే సతి నుండి విముక్తి పొందుతారు. మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. పెళ్లికాని వ్యక్తులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. 


Also Read: Rath Saptami 2023: రథసప్తమి ఎప్పుడు? ఈ పండుగ విశిష్టత ఏంటి? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook