Mercury Direct Movement effect: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడి అని పిలుస్తారు. అష్ట గ్రహాల్లో ఇది ఒకటి మరియు సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. ఇతడి గమనంలో మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. మరో మూడు రోజుల తర్వాత అంటే సెప్టెంబరు 16 మధ్యాహ్నం 1:21 గంటలకు బుధుడు నేరుగా నడవడం మెుదలపెట్టనున్నాడు. ఏ వ్యక్తి జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. మెర్క్యూరీ ప్రత్యక్ష సంచారం ఏయే రాశులవారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి 
బుధుడు నేరుగా నడవడం వల్ల మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి కోరిక నెరవేరుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. పెట్టుబడులు మీకు అనుకూలిస్తాయి. 
తులారాశి
మెర్క్యూరీ సంచారం వల్ల తులరాశి వారు చాలా ప్రయోజనాలు పొందుతారు. జాబ్ చేంజ్ అవ్వడానికి ఇదే మంచి సమయం. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. మీకు కెరీర్ లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆఫీసులో మీ సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది. 
మేషరాశి
బుధుడి ప్రత్యక్ష సంచారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. మెర్క్యూరీ గమనంలో మార్పు వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ జీతం పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. ప్రతి పనిలో అదృష్టం మీ వెంటే ఉంటుంది.


Also Read: Solar And Lunar Eclipse In 2023: ఒకే నెలలో సూర్య,చంద్ర గ్రహణాలు..ఏం జరుగతుందో తెలుసా?


మిధునరాశి
బుధుడి గమనంలో మార్పు మిథునరాశి వారికి ఊహించని లాభాలను ఇస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీకు లాటరీ తగిలే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా బలపడతారు. ఈసమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు మంచి లాభాలను ఆర్జిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మెర్క్యూరీ సంచార సమయంలో తొందరపడి ఎలాంటి పనులు చేయవద్దు. 


Also Read: Budhaditya Rajayogam 2023: బుధాదిత్య రాజయోగంతో ఈ మూడు రాశులకు అక్టోబర్ 11 నుంచి అంతా మహర్దశే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook