Budhaditya Rajayogam 2023: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలకు, రాశులకు మధ్య కీలకమైన సంబంధముంది. ఒక్కోసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో కలుస్తుంటాయి. అదే విధంగా సూర్య, బుధ గ్రహాల కలయికతో యుతి ఏర్పడనుంది. ఈ యుతి బుధాదిత్య రాజయోగానికి కారణమౌతుంది. జ్యోతిష్యం ప్రకారం బుధాదిత్య రాజయోగాన్ని అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
హిందూమత జ్యోతిష్యం ప్రకారం అకోబర్ నెలలో శుక్రగ్రహం తులా రాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పర్చనున్నాడు. సూర్య, బుధ గ్రహాల కలయికతో ఏర్పడనున్న బుధాదిత్య రాజయోగానికి అమితమైన ప్రయోజనం కలగనుంది. బుధాదిత్య రాజయోగం ఏ రాశిలో ఏర్పడితే ఆ రాశి జాతకానికి ఇక తిరుగుండదు. ఊహించని ధనలాభం కలుగుతుంది. అన్నింటా విజయం సొంతమౌతుంది. అక్టోబర్ 11న సూర్యుడు తుల రాశిలో గోచారంతో ఈ రాజయోగం ఏర్పడనుంది. తుల రాశిని ధన వైభోగం, అష్ట ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. ఫలితంగా తుల రాశితో పాటు మరో మూడు రాశుల జాతకాలకు అదృష్టం తోడుగా నిలుస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
ధనస్సు రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం అత్యంత అనుకూలంగా ఉండనుంది. వ్యాపారం కొత్తగా విస్తరించే అవకాశాలుంటాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు అంతా కలిసొస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పదోన్నతి లభిస్తుంది. కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు.
మకర రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగంతో అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే అవకాశాల్ని చేజార్చవద్దు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. భవిష్యత్తులో చాలా లాభాలు పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. వ్యాపారులైతే అమితమైన లాభాలు ఆర్జిస్తారు.
Also read: Anant Chaturdashi 2023: అనంత చతుర్దశి ఎప్పుడు? ఈ పండుగకు, వినాయకుడికి సంబంధమేంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook