Budh Reverse: మే 15 వరకు ఈ రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి ఉందా?
Budh Gochar 2023: మేష రాశిలో బుధుడు తిరోగమనం చెందనున్నాడు. దీని కారణంగా ధన సామ్రాజ్య రాజయోగం ఏర్పడనుంది. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Mercury Retrograde 2023: బుధుడు రీసెంట్ గా మేషరాశిలో తిరోగమనం చెందాడు. మే 15 వరకు మెర్క్యూరీ అదే రాశిలో సంచరించనున్నాడు. బుధుడి సంచారం కారణంగా ధన సామ్రాజ్య రాజయోగం ఏర్పడింది. ఆస్ట్రాలజీలో దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రాజయోగం కారణంగా మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
బుధుడి తిరోగమనం ఈ రాశులకు వరం
మేష రాశి
ధన రాజయోగం మేష రాశి వారికి మేలు చేస్తుంది. బుధుడి తిరోగమనం కారణంగా మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మ కోరికలన్నీ నెరవేరుతాయి. పార్టనర్ షిప్ చేసే పనుల్లో మీరు విజయం సాధిస్తారు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది.
మకర రాశి
సంపద సామ్రాజ్యం రాజయోగం మీకు కలిసి వస్తుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీ వ్యక్తిత్వం నలుగురిని ఆకట్టుకుంటుంది. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆఫీసులో మీకు అధికారుల మద్దతు ఉంటుంది. రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ, ఆయిల్, పెట్రోలియం వంటి వ్యాపారాలు చేసే వారు లాభపడతారు.
Also Read: Guru Gochar 2023: గురుడు సంచారంతో ఈ 5 రాశులకు నరకం.. ఇందులో మీరున్నారా?
కుంభ రాశి
ధన సామ్రాజ్య రాజయోగం కుంభ రాశి వారికి కలిసి వస్తుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి మూడవ ఇంట్లో తిరోగమనం చెందనున్నాడు. విదేశీ వ్యాపారం చేసేవారు ప్రయోజనం పొందనున్నారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. డబ్బును ఆదా చేస్తారు. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.
Also Read: Surya Grahan 2023: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం చాలా ప్రత్యేకం.. అదేంటో తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook