Budhaditya Raj Yog Benefits: తెలివితేటలు, కమ్యూనికేషన్, వ్యాపారం మరియు గణితానికి కారకుడు బుధుడు. ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల యువరాజు బుధుడు నవంబరు 13న వృశ్చికరాశిలో సంచరించాడు. మరో రెండు రోజుల్లో అంటే నవంబరు 16న గ్రహాల రాజైన సూర్యభగవానుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించనున్నాడు. వృశ్చికరాశిలో ఈ రెండు గ్రహాలు కలిసి బుధాదిత్య యోగాన్ని (Budhaditya Raj Yog) ఏర్పరుస్తాయి. ఈ యోగం మూడు రాశులవారికి ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధాదిత్య యోగం ఈ రాశులకు  శుభప్రదం
వృషభం (Taurus): బుధాదిత్య రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో ఏడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. మీరు భాగస్వామ్యంతో చేసే వ్యాపారం లాభాలను ఇస్తుంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
వృశ్చికం (Scorpio): బుధాదిత్య రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ లగ్నస్థుడి ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత వ్యాధి నుండి విముక్తి లభిస్తుంది. మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలను పొందుతారు. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు మీకు లభిస్తాయి. 
కుంభం (Aquarius): బుధాదిత్య రాజయోగం వ్యాపార మరియు వృత్తి పరంగా మీకు శుభప్రదంగా ఉంటుంది. దీంతో నిరుద్యోగులకు జాబ్ ఆఫర్లు రావచ్చు. ఉద్యోగులు పురోగతితోపాటు ప్రమోషన్ పొందుతారు. ఆఫీసులో మీ పనికి ప్రసంసలు దక్కుతాయి. ఫ్యామిలీ సహకారంతో మీరు అనుకున్నది సాధిస్తారు. 


Also Read: Laxmi Narayan Yoga: లక్ష్మీ నారాయణ యోగం అంటే ఏమిటి? ఇది ఏ రాశుల వారికి ప్రత్యేకం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook