Chaitra Navratri 2023: చైత్ర నవరాత్రి ఉపవాసం చేస్తున్నారా? ఇలా మాత్రం అసలు చేయకండి!
Chaitra Navratri 2023 Update: ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రి చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో జరుపుకుంటూ ఉంటారు, హిందూ మత విశ్వాసాల ప్రకారం, నవరాత్రుల 9 రోజులు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు!
Chaitra Navratri 2023 News: ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రి చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో జరుపుకుంటూ ఉంటారు. ముందుగా ఈ నవరాత్రుల మొదటి రోజున కలశాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక ఈ సంవత్సరం చైత్ర నవరాత్రులు మార్చి 22 నుండి మార్చి 30 వరకు జరుపుకోనున్నారు. అంటే ఈ ఏడాది మార్చి 22న కలశాన్ని ఏర్పాటు చేస్తారు.
ఇక ఈ 9 రోజుల పాటు ప్రతిరోజూ దుర్గా దేవికి చెందిన 9 రూపాలు పూజిస్తారు. దుర్గాదేవిని పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. దుర్గా దేవిని పూజించడం ద్వారా కోరికలు కూడా నెరవేరుతాయని చెబుతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, నవరాత్రుల 9 రోజులు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదని చెబుతున్నారు. అవేమిటో చూద్దామా?
చైత్ర నవ రాత్రులలో జుట్టు, గడ్డం మరియు మీసాలు కత్తిరించకూడదు, అలా చేస్తే ఉపవాసం ఫలితం ఇవ్వదని నమ్ముతారు.
అంతేకాక మీరు నవరాత్రి వ్రతాన్ని పాటించినట్లయితే, లెదర్ బెల్టులు, చెప్పులు, బ్యాగులు మొదలైన వాటిని ఉపయోగించకూడదని చెబుతున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాడకూడదు.
నవరాత్రులలో ఉపవాసం ఉండే వారు నిమ్మకాయలు కానీ పనసపండును కోయకూడదని చెబుతున్నారు.
అంతేకాదు నవరాత్రులలో నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించరాదు. నవరాత్రులలో ఉపవాసం ఉండేవారు ధాన్యాలు అలాగే ఉప్పు కూడా తినకూడదు.
ఇక ఈ 9 రోజుల ఉపవాసంలో ఉన్నప్పుడు అస్సలు మురికి బట్టలు ధరించకూడదు.
ఇక దుర్గమ్మను తడి బట్టలు ధరించి పూజించాలి.
ఇక ఆ తరువాత తల్లిని పూజించే సమయంలో పొడి బట్టలు ధరించి పూజించాలి.
ఇక ఈ నవరాత్రులలో వెల్లుల్లి-ఉల్లిపాయలు అసలు తీసుకోకూడదు.
నవ రాత్రులలో మాంసం, చేపలు మరియు మద్యం అసలు తీసుకోకూడదు, అలా చేయడం మత విశ్వాసాల ప్రకారం అశుభం.
ఇక నవరాత్రుల తొమ్మిది రోజులు గోళ్లు కత్తిరించకూడదు. అందుకే నవరాత్రి ప్రారంభానికి ముందే గోర్లు కత్తిరించండి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మొత్తం సాధారణ విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. జీ తెలుగు న్యూస్ దానిని ధృవీకరించలేదు. ఏదైనా సమాచారాన్ని అమలు చేయడానికి ముందు, దయచేసి సంబంధిత నిపుణులను సంప్రదించండి.)
Also Read: Shani Gochar 2023: మార్చి 18 నుండి ఈ 4 రాశులకు ఐశ్వర్యం, అదృష్టం.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook