Guru Asta 2023: అస్తమించబోతున్న గురుడు.. రాబోయే 74 రోజులపాటు ఈ రాశులకు కష్టాలే కష్టాలు.. ఇందులో మీది ఉందా?

Guru Asta 2023:  ఈ నెల చివరిలో దేవగురు బృహస్పతి ఉదయించబోతున్నాడు. దీని కారణంగా రెండు మూడు నెలల్లో ఈ మూడు రాశులవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 14, 2023, 11:19 AM IST
Guru Asta 2023: అస్తమించబోతున్న గురుడు.. రాబోయే 74 రోజులపాటు ఈ రాశులకు కష్టాలే కష్టాలు.. ఇందులో మీది ఉందా?

Guru Asta 2023:  గ్రహాలు కాలానుగుణంగా రాశిని మార్చడం, ఉదయించడం మరియు అస్తమించడం చేస్తాయి. గ్రహాల అస్తమించడం అనేది వ్యక్తి యెుక్క జీవితంపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మరోసారి బృహస్పతి గ్రహం అస్తమించబోతుంది. గురుడు మార్చి 28, మంగళవారం నాడు మీనరాశిలో అస్తమించనున్నాడు. మళ్లీ ఏప్రిల్ 27,  గురువారం నాడు ఉదయించనున్నాడు. దేవగురు ఏప్రిల్ 22న అస్తమించే స్థితిలో మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. జ్యూపిటర్ అస్తమయం వల్ల ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. 

ఈ మూడు రాశులవారు జాగ్రత్త
మేషరాశి
ఈ రాశి యెుక్క పన్నెండవ ఇంట్లో బృహస్పతి అస్తమించబోతున్నాడు. పైగా మేషరాశిలోని తొమ్మిదవ మరియు పన్నెండవ గృహాలకు అధిపతి. ఈ సమయంలో మేషరాశి వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీకు అదృష్టం కలిసి రాదు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. మీరు ఏ పని చేపట్టినా దానిని పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకుంటారు. 
సింహరాశి 
సింహ రాశి వారి ఎనిమిదవ ఇంట్లో గురుడు అస్తమిస్తున్నాడు. దీంతో మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. అంతేకాకుండా ఈ సమయం మీకు ఆర్థికంగా కలిసిరాదు. దాంపత్య జీవితంలో సమస్యలు వస్తాయి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. 
కుంభ రాశి
ఈ రాశి యెుక్క రెండవ ఇంట్లో బృహస్పతి అస్తమిస్తున్నాడు. గురుడు సెట్ మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం మానుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. 

Also Read: Solar Eclipse 2023: ఏప్రిల్ 20న తొలి సూర్యగ్రహణం.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News