Chandra Grahan 2022: 2023 అక్టోబర్ వచ్చే గ్రహణం కంటే ఇదే పెద్ద చంద్ర గ్రహణం.. నేరుగా చూస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
Chandra Grahan 2022 Date Time: చంద్ర గ్రహణం రోజున చాలా మంది చంద్రున్ని చూడాలనుకుంటారు. అయితే నేరుగా చూడడం వల్ల పలు రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Chandra Grahan 2022 Date Time: భారత్‌లో ఈ ఏడాది చంద్రగ్రహం నవబంర్ 8న ఏర్పడబోతోంది. ఇది చంద్ర గ్రహం ఏడాదిలో చివరి చంద్ర గ్రహమని ఖగోళ శాస్త్ర వేత్తలు తెలుపుతున్నారు. అయితే ఈ గ్రహం సంపూర్ణ చంద్రగ్రహం కావడంతో కేవలం భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే అవకాశాలున్నాయి. ఇప్పటికే చంద్ర గ్రహణానికి సంబంధించిన సమాచారాన్ని శాస్త్ర వేత్తలు వివరించారు. అయితే భాతర దేశంలో ఏ ప్రాంతంలో క్లుప్తంగా కనిపించే అవకాశాలున్నాయి..? ఈ చంద్ర గ్రహం నేరుగా చూడడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం..
చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?:
భారతదేశంలోని తూర్పు భాగంలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కంటే ఇతర రాష్ట్రాల్లో పాక్షిక చంద్రగ్రహణం చూడవచ్చని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇక చంద్ర గ్రహణం విషయానికొస్తే.. భారతదేశంతో పాటు, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, బ్రెజిల్, యూరప్, దక్షిణ అమెరికా వంటి ఇతర దేశాలు కూడా 8 నవంబర్ 2022న చంద్రగ్రహణాన్ని చూడవచ్చని ఖగోళ శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాన నగరాల్లో చంద్రగ్రహణం ప్రారంభ, ముగింపు సమయాలు:
>>కోల్‌కతాలో చంద్రుడు సాయంత్రం 4:52 గంటలకు తూర్పు ప్రాంతంలో ఆకాశంలో ప్రత్యేక్ష మవుతాడు. పాక్షికంగా 4:54 గంటలకు కనిపిస్తుందని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు..
>>దేశంలోని తూర్పు ప్రాంతంలోని కోహిమా, అగర్తల, గౌహతి వంటి నగరాల్లో కోల్‌కతా కంటే ముందే సంపూర్ణ గ్రహణం కనిపిస్తుంది. కోహిమాలో మాత్రమే గ్రహణం దాని గరిష్ట దశలో సాయంత్రం 4:29కి కనిపిస్తుందని శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈ ప్రాంతాల వారు ప్రత్యేకంగా చంద్ర గ్రహణం చూడవచ్చు.
>>న్యూ ఢిల్లీ చంద్రోదయం నుంచి ఉదయం 5:31 గంటలకు పాక్షిక గ్రహణం ఏర్పడనుంది. గ్రహణం మొత్తం దశ సాయంత్రం 5:11 గంటలకు ముగిసే అవకాశాలున్నాయని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
>>ఇక బెంగళూరు విషయానికొస్తే.. చంద్రుడు సాయంత్రం 5:57 గంటలకు పూర్తిగా ఉదయించి.. ముంబైలో ఉదయం 6:03 గంటలకు 14 శాతంతో కనిపించే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు అభిప్రాయడుతున్నారు.
చంద్రగ్రహణం అంటే ఏమిటి?:
చంద్రుడిపై ఇతర గ్రహాల నీడ పడినప్పుడు భూమికి చంద్రుడు నీడగా కనిపిస్తారు. దీనినే చంద్రగ్రహణం అంటారు. అయితే ఇదే క్రమంలో సూర్యుడు ఉంటే సూర్య గ్రహణం అంటారని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. చంద్రుడు ఏదైనా చంద్ర కణుపుల దగ్గర ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది.
చంద్రగ్రహణాన్ని నేరుగా చూడొచ్చా..?:
నవంబర్ 8న జరగనున్న చంద్రగ్రహణాన్ని చూడాలని మీకు ఆసక్తి ఉంటే.. భారతదేశ తూర్పు ప్రాంతంలో నివసించే ప్రజలు దీనిని తప్పకుండా చూడొచ్చని శాస్త్ర వేత్తలు తెలుపుతున్నారు. కానీ ఈ క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఇక భారత దేశంలో అన్ని రాష్ట్రాల విషయాని కోస్తే.. ఇతర ప్రాంతాల వారు పాక్షిక చంద్రగ్రహణాన్ని చూడవచ్చని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సూర్య గ్రహణం కాకుండా చంద్ర గ్రహణాన్ని నేరుగా చూడొచ్చని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
2023లో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది:
భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7, 2025న ఏర్పడబోతోంది. అయితే అక్టోబర్ 2023లో భారతదేశంలో చిన్న పాక్షిక గ్రహణం కనిపించే అవకాశాలున్నాయని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ పరుగుల దాహం తీరనిది.. మరో రికార్డుకు చేరువలో..
Also Read: YSRCP MLA Tears: కన్నీళ్లు పెట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. కష్టాలు తెలుసుకుని భావోద్వేగం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook