Chandra Grahan Effects On Zodiac Signs: ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించబోతున్నాయి. వీటిలో రెండు చంద్ర గ్రహణాలు కాగా, రెండు సూర్య గ్రహణాలున్నాయి. గత నెలలో సూర్య గ్రహణం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అతి త్వరలోనే ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం కూడా సంభవించబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ చంద్రగ్రహణం మే 5 శుక్రవారం జరగబోతోంది. ఇదే రోజున బుద్ధ పూర్ణిమ కూడా వస్తోంది. ఈ చంద్రగ్రహణం తులరాశి, స్వాతి నక్షత్రంలో ఏర్పడుతుంది.  ఈ చంద్రగ్రహణం ప్రభావం రాత్రి 08.44 గంట నుంచి 01.02 వరకు ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రగ్రహణం అనేది భౌగోళిక దృగ్విషయం అయినప్పటికీ..పౌర్ణమి రాత్రి చంద్రుడిని రాహువు, కేతువు గ్రహలు మింగడానికి ప్రయత్నాలు చేస్తాయని అందరూ నమ్ముతారు. చంద్ర గ్రహణానికి కొన్ని గంటల ముందు సూతక కాల సమయం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారిపై చంద్ర గ్రహణ ప్రభావం పడే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావంత పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ఈ రాశులవారిపై చంద్రగ్రహణ ప్రభావం:
1. మేషం:

చంద్రగ్రహణం కారణంగా మేషరాశిపై కూడా ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా వాహిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు. అంతేకాకుండా మానసికంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. వైవాహిక జీవితం గడుపుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 


2. వృషభం:
శుక్రుడు వృషభ రాశికి అధిపతి.. కాబట్టి చంద్రగ్రహణం ఈ రాశివారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు కచ్చితంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.


Also Read:  Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్


3. మిథునరాశి:
మిథునరాశి రాశివారిపై కూడా చంద్రగ్రహణ ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహణం ఐదవ స్థానంలో జరుగుతుంది. కాబట్టి వీరు కూడా ఆరోగ్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. ఈ క్రమంలో మీకు పిల్లలు ఉంటే జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 


4. కర్కాటకం:
చంద్రగ్రహణం ప్రభావం కర్కాటకం రాశివారిపై కూడా పడుతుంది. ఈ గ్రహణ సమయంలో తప్పకుండా తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది. 


5. సింహ:
సింహ రాశివారిపై కూడా చంద్రగ్రహణం ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు పని చేస్తున్న కార్యాలయంలో కొన్ని సమస్యలను రావొచ్చు. ఈ క్రమంలో డబ్బు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.


Also Read:  Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook