March Chandra Grahan Sutak Timing: ఖగోళ శాస్త్రం ప్రకారం..చంద్రగ్రహణం భూమి సూర్యుడు, చంద్రుని మధ్య అడ్డంగా వచ్చినపుడు ఏర్పడుతుంది. ఈ సమయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే ఇదే సమయంలో భూమినికి సంబంధించిన పూర్తి నీడ కూడా మూన్‌పై పడుతుందని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గ్రహణం ఏర్పడడం వల్ల శుభ, అశుభ ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం సూర్య, చంద్రగ్రహణాలు సంభవించడం శుభప్రదం కాదు. అందుకే ఈ సమయంలో పూజా కార్యక్రమాలు చేయడం నిశిద్ధంగా భావిస్తారు. ఈ సంవత్సరం 100 ఏళ్ల తర్వాత చంద్రగ్రహణం యాదృచ్ఛికంగా సంభవించబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. గత వంద సంవత్సరాల క్రితం చంద్రగ్రహణం సమయంలోనే హోలీ వచ్చిందని, ఈ సంవత్సరం కూడా గ్రహణం సమయంలోనే హోలీ వస్తోంది. హిందూ పురాణాల ప్రకారం ఈ హోలీ పండగను సంవత్సరంలోని చివరి పండగగ భావిస్తారు. ఇలాంటి పండగ రోజు చంద్రహణం ఏర్పడడం చాలా అరుదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఇలా పండగ రోజు ఏర్పడడం చాలా అశుభమని వారంటున్నారు. అంతేకాకుండా ఈ గ్రహణానికి 9 గంటకు ముందు సూతక కాలం కూడా ఏర్పడబోతోందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హోలీపై చంద్రగ్రహణం ప్రభావం పడబోతోందా?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఏర్పడబోయే చంద్రగ్రహణం ప్రభావం హోలీ పండగపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు లేవు. అంతేకాకుండా ఈ గ్రహణం భారత్‌లో కనిపించే అవకాశాలు కూడా లేవని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు సూతకాలం కూడా చెల్లుబాటు కాదని వారంటున్నారు. అలాగే కాముడు దాహనం చేసేవారు కూడా ఈ సమయంలో ఎలాంటి అనుమానాలు లేకుండా చేయోచ్చని నిపుణులు సూచిస్తునారు. అంతేకాకుండా ఎప్పటి లాగా రంగులు పండగను కూడా చేసుకోవచ్చు. 


నాలుగైదు గంటల పాటే ప్రభావం:
ఈ సంవత్సరం ఏర్పడబోయే చంద్రగ్రహణం మార్చి 25 ఉదయం 10.23 గంటలకు మొదలు కాబోతోంది. అయితే ఈ గ్రహణం మధ్యాహ్నం 3.02 గంటలకు ముగుస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీనిని సంపూర్ణ చంద్రగ్రహణంగా కూడా పరిగణిస్తారు. ఈ గ్రహణాకి సంబంధించిన  స్పర్శ కాలం రాత్రి 10:24 వరకు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ సమయం తర్వాత పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభించవచ్చు. అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావం భారత్‌ పడదు.. కాబట్టి ఈ సమయంలో శుభకార్యక్రమాలు చేయడం కూడా చాలా శుభప్రదం. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


ఈ దేశాలపై చంద్రగ్రహణం ప్రభావం:
ఈ గ్రహణం భారతదేశంపై ప్రభావం చూపకపోయిన ప్రపంచంలోని కొన్ని దేశాలపై ప్రభావం పడుతుందని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
చంద్రగ్రహణం ఫ్రాన్స్, హాలండ్, బెల్జియం, దక్షిణ నార్వేతో పాటు ఇంగ్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, జర్మనీలో కనిపిస్తుంది. అంతేకాకుండా అమెరికా, జపాన్, రష్యా, ఐర్లాండ్‌ దేశాల్లో కూడా కనిపిస్తుంది.  భారత్‌తో పాటు దక్షిణాసియాలో కొన్ని ముఖ్యమైన దేశాల్లో కనిపించే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి