Numerology: జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి అంకెకు ఓ సంబంధం, ఓ విశేషముంది. ఆ అంకెను బట్టి వారి వ్యక్తిత్వం, భవిష్యత్‌తో పాటు ఆర్ధిక పరిస్థితి కూడా అంచనా వేయవచ్చు. ఈ క్రమంలోనే టోటల్ నెంబర్ 6 జాతకుల గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం సంఖ్యాశాస్త్రానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. టోటల్ నెంబర్ 6 జాతకులపై లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. టోటల్ నెంబర్ 6 కలిగినవాళ్ళకు అంతులేని ధన సంపద కలుగుతుందట. ఇంకా ఈ జాతకుల ప్రత్యేకతలు కూడా జ్యోతిష్యశాస్త్రంలో ఉన్నాయి. 
టోటల్ నెంబర్ 6 కు గురు గ్రహం శుక్రుడు. శుక్రుడి ప్రభావంతో లగ్జరీ లైఫ్ ఉంటుంది. వీరి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. కానీ ప్రతి పరిస్థితిని ఎదుర్కొని..తిరిగి ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటారు. 


టోటల్ నెంబర్ 6 జాతకులకు వారసత్వంగా భూమి, సంపద లభిస్తాయి. కొంతమందికైతే అత్తారింటి తరపు నుంచి ఆస్థులు లభిస్తాయి. ఇంకొంతమంది సొంతంగా కూడా డబ్బులు సంపాదించుకుంటారు. పేద కుటుంబలో పుట్టినా సరే..తమ ప్రతిభ, శ్రమ, సామర్ధ్యం ద్వారా అనుకున్నది సాధిస్తారు. మొత్తంగా చూస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుంది. ధనవంతులౌతారు. 


శుక్రుడి కటాక్షంతో టోటల్ నెంబర్ 6 జాతకులకు అన్ని రకాల భౌతిక సుఖాలు లభిస్తాయి. అంతేకాకుండా..వారి వైవాహిక జీవితం కూడా సుఖమయంగా ఉంటుంది. ఈ జాతకం కలిగినవారు రొమాంటిక్, కళాత్మక వస్తువుల్ని ఇష్టపడతారు. ఈ జాతకులవైపు ఇతరులు చాలా త్వరగా ఆకర్షితులౌతారు. ఈ జాతకులు అందంగా కూడా ఉంటారు. త్వరగా ఇతరుల పట్ల ఆకర్షితులౌతారు. అందుకే ఎఫైర్లు ఎక్కువగా ఉంటాయి.


టోటల్ నెంబర్ 6 జాతకులు వాస్తవ వయస్సు కంటే తక్కువ వయస్సుగా కన్పిస్తారు. ఎప్పుడూ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు ఇష్టపడతారు. వయస్సు పెరిగే కొద్దీ వీరిలో ఆకర్షణ పెరుగుతుంది. వృద్ధాప్యం ప్రభావం చూపించదు. ఈ జాతకులు నమ్మదగిన, విశ్వసనీయ వ్యక్తులే కాకుండా నిజాయితీ పరులు, మంచి స్నేహితులు, మంచి జీవిత భాగస్వాములుగా ఉంటారు. 


Also read: Mangala Gauri Vratam: శ్రావణంలో మంగళ గౌరి వ్రతం ఎందుకుంటారు, ఆ వ్రతం కధేంటి



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook