Rajyog 2024: 15 ఏళ్ల తర్వాత మహాయోగం.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..
Mercury transit in March 2024: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. త్వరలో మీనరాశిలో రెండు గ్రహాల అరుదైన కలయిక జరగబోతోంది. ఇది మూడు రాశులవారికి లాభదాయకంగా ఉండబోతోంది.
Rahu Budh Yuti in Meena Rashi 2024: దుష్ట గ్రహమైన రాహువు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మార్చి 07న ఇదే రాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు. మీనరాశిలో రాహువు మరియు బుధుడు కలయిక 15 సంవత్సరాల తర్వాత సంభవించబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండబోతోంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
కుంభ రాశి
రాహు బుధ సంయోగం కుంభరాశి వారికి చాలా మేలు చేస్తోంది. మీ సంపద అనేక రెట్లు పెరుగుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీరు ప్రతికార్యంలో సఫలీకృతమవుతారు. మీరు ఆర్థికంగా లాభపడతారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ పనికి మీ బాస్ ప్రశంసలు లభిస్తాయి. బ్యాంకింగ్, మార్కెటింగ్ మరియు మీడియాకు చెందిన వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
మిథునరాశి
ఆస్ట్రాలజీ ప్రకారం, రాహువు మరియు బుధుడు కలయిక మిథునరాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది. దీంతో మీరు కెరీర్ లో మంచి ఫలితాలను పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఫారిన్ వెళ్లి చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతోంది. ఉద్యోగం సాధించాలనే మీ కల ఫలిస్తుంది. వ్యాపారస్తులు లాభపడతారు. పూర్వీకుల ఆస్తి మీకు లభిస్తుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు.
కర్కాటక రాశి
ఈ రాశి యొక్క తొమ్మిదవ ఇంట్లో వీరి సంయోగం జరగబోతోంది. మిమ్మల్ని అదృష్టం వరించనుంది. ఆగిపోయిన పనులు వెనువెంటనే పూర్తవుతాయి. మీకు దైవభక్తి పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక తీరుతుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త పని లేదా వ్యాపారం మెుదలుపెట్టడానికి ఇదే మంచి సమయం. మీరు చేపట్టిన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తారు.
Also Read: Mangal Gochar 2024: మరో 6 రోజుల తర్వాత ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్
Also Read: Mercury Transits 2024: శని రాశిలోకి బుధ గ్రహం..ఈ రాశులవారు లైఫ్ సెటిల్ టైమ్ రాబోతోంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter